Jan 10,2023 21:28

ఫొటో : సిబ్బందితో మాట్లాడుతున్న డిప్యూటీ డిఇఒ

మోడల్‌ స్కూల్లో డిప్యూటీ డిఇఒ సందర్శన
ప్రజాశక్తి-మర్రిపాడు : మండలంలోని నందవరం ఎపి మోడల్‌ స్కూల్‌ను మంగళవారం డిప్యూటీ డిఇఒ హరిప్రసాద్‌ సందర్శించారు. బాలికల హాస్టల్‌లో ఇటీవల ఓ వ్యక్తి చొరబడడంతో హాస్టల్‌ సిబ్బంది పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఆ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే ఇప్పటివరకుఆ కేసు మాత్రం ముందుకు సాగలేదు. తాజాగా జిల్లా అధికారుల ఆదేశాల మేరకు హాస్టల్లో జరిగిన ఘటనపై డిప్యూటీ డిఇఒ విచారణ చేపట్టారు.
విచారణ నివేదికను జిల్లా అధికారులకు అందజేస్తామని ఆయన తెలిపారు. ఘటన జరిగి నెలలు గడుస్తున్న ఇంతవరకు చర్యలు ఎందుకు తీసుకోలేదని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. స్కూల్లో జరిగిన ఘటనపై విచారణకు వచ్చిన అధికారులు సైతం తూ.తూ. మంత్రంగానే విచారణ చేస్తున్నారు. మరి ఈ ఘటనపై అధికారులు ఏం తెలుస్తారో వేచి చూడాల్సి ఉంది.