Apr 15,2023 19:34

మాట్లాడుతున్న సిపిఎం సీనియర్‌ నాయకలు ముప్పరాజు కోటయ్య

ప్రజాశక్తి -కందుకూరు :కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా సిపిఐ, సిపిఎం ఆధ్వర్యంలో మోడిని గద్దె దింపి భారతదేశాన్ని కాపాడుకుందాం అంటూ ప్రచార యాత్రను శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా సిపిఐ, సిపిఎం నాయకులు మాట్లాడుతూ ప్రభుత్వ ఆస్తులను ప్రయివేటుపరం చేస్తూ కేంద్ర ప్రభుత్వం ప్రజల ధనాన్ని కొల్లగొట్టి కార్పొరేట్‌ శక్తులకు ధారాదత్తం చేసుందని విమర్శించారు. సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు పోకూరు మాలకొండయ్య, సిపిఎం సీనియర్‌ నాయకులు ముప్పరాజు కోటయ్య, సిపిఐ కందుకూరు నియోజకవర్గం కార్యదర్శి బూసి సురేష్‌ బాబు, సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు ఎస్‌ఏ గౌస్‌, ఎఐటియుసి కందుకూరు నియోజకవర్గ కార్యదర్శి వై ఆనంద మోహన్‌, సిపిఐ నియోజకవర్గ కార్యవర్గ సభ్యులు షేక్‌ హుస్సేన్‌, ఎఐటియుసి నాయకులు మురళి, కోటేశ్వరరావు, స్వర్ణకారుల సంఘం నాయకులు బాల బ్రహ్మచారి, సిపిఐ నాయకులు యనమల కొండయ్య, సిపిఎం పట్టణ కమిటీ సభ్యులు షేక్‌ మున్వర్‌ సుల్తానా, టి వెంకట్రావు, సిఐటియు పట్టణ అధ్యక్షులు డి రామ్మూర్తి, సిఐటియు నాయకులు ఎం ప్రసాదు ఉన్నారు.