Mar 26,2023 22:20

పోస్టర్లు విడుదల చేస్తున్న నాయకులు

గుడిబండ : రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘం. సిఐటియు ఆధ్వర్యంలో చలో ఢిల్లీ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు ఇంతియాజ్‌ పిలుపునిచ్చారు గుడిబండ జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో రైతు సంఘం, వ్యవసాయ కార్మికుల సంఘం, ఎస్‌ఎఫ్‌ఐ, అంగన్వాడీ, ఆశా వర్కర్ల యూనియన్‌ నాయకులతో ఆదివారం సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో పాల్గొన్న ఇంతియాజ్‌ మాట్లాడుతూ కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటాల కోసం ఏప్రిల్‌ 5న సిఐటియు ఆధ్వర్యంలో చలో ఢిల్లీ కార్యక్రమాన్ని చేపట్టినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో ప్రతి కార్మికులు పాల్గొని జయప్రదం చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కోశాధికారి సాంబశివ. ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా ఉపాధ్యక్షులు వీరేష్‌, అంగన్వాడీ యూనియన్‌ లీడర్లు శ్రీదేవి, ఉషారాణి, ఆశ వర్కర్ల యూనియన్‌ లీడర్లు సౌభాగ్యమ్మ, అంజమ్మ, యశోద, లక్ష్మితో పాటు రైతు వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు.
కదిరి టౌన్‌ : కేంద్రంలోని మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా మరో పోరాటానికి సిద్ధమైనట్లు సిఐటియు, రైతు సంఘం, కౌలు రైతు సంఘం నాయకులు తెలిపారు. బీజేపీకి వ్యతిరేకంగా ఏప్రిల్‌ 5న చేపట్టిన చలో ఢిల్లీ కార్యక్రమానికి సంబందించిన గోడపత్రికలను ఆయా సంఘాల నాయకులు ఆదివారం స్థానిక సిఐటియు కార్యాలయంలో విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు జిఎల్‌ నరసింహులు, జగన్మోహన్‌, రామ్మోహన్‌, కృష్ణ నాయక్‌, రైతు సంఘం నాయకులు నాగరాజు, కెవిపిఎస్‌ నాయకులు నారాయణ, ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు బాబ్జాన్‌ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజాసమస్యల పరిష్కారంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందన్నారు. కార్మికులకు కనీస వేతనం నెలకు 26వేల రూపాయలు ఇవ్వాలన్నారు. కనీస మద్దతు ధర గ్యారెంటీ చట్టం చేయాలన్నారు. కేరళ తరహా రైతు రుణమాఫీ చేయాలని విద్యుత్‌ సవరణ బిల్లు 2022 రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. ఉపాధి హామీ చట్టానికి బడ్జెట్లో రూ.2 లక్షల కోట్లకు పెంచాలన్నారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా తలపెట్టిన ఈ పోరుకు కార్మికులు కర్షకులు నిరుద్యోగులు కలిసిరావాలని పిలుపునిచ్చారు.
సోమందేపల్లి : మోడీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ సిఐటియు, రైతు, వ్యవసాయ కార్మిక సంఘ, రైతు సంఘాలు, కౌలు రైతు సంఘ ఆధ్వర్యంలో ఏప్రిల్‌ 5న చేపట్టిన చలో ఢిల్లీ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని సిపిఎం నాయకులు కోరారు. ఈ మేరకు వారు చలో డిల్లీ కార్యక్రమానికి సంబందించిన పోస్టర్లను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పెద్దన్న, కెవిపిఎస్‌ జిల్లా అధ్యక్షులు హనుమయ్య , భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి రంగప్ప , జిల్లా కమిటీ సభ్యులు నాగభూషణ , సిఐటియు మండల నాయకులు కొండా వెంకటేశులు, రవి, చేనేత కార్మిక సంఘం మండల నాయకులు శీలా నారాయణస్వామి, బెస్త క్రిష్టప్ప, ఉప్పర కిష్టప్ప, ఈడిగ నాగరాజు , రైతు సంఘం కార్యకర్తలు రామాంజనప్ప, కదిరప్ప, ఐద్వా మండల నాయకులు లలితా బాయి తదితరులు పాల్గొన్నారు.
పెనుకొండ : ఏప్రిల్‌ 5న చేపట్టిన ఛలో ఢిల్లీ పోస్టర్లను సిఐటియు ,రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘం, కౌలు రైతుల సంఘం నాయకుల ఆధ్వర్యంలో ఆదివారం పట్టణంలోని ఆర్‌ అండ్‌ అతిధి గహం వద్ద విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు హరి, సిఐటియు జిల్లా కార్యదర్శి రమేష్‌ , మండల కార్యదర్శి బాబావలి, తిప్పన్న, వజ్రం నాగప్ప, అంగన్వాడి వర్కర్స్‌ యూనియన్‌ ప్రాజెక్ట్‌ అధ్యక్షురాలు బావమ్మ, నగర పంచాయతీ కార్మికుల యూనియన్‌ నాయకులు చిన్న వెంకటేష్‌,ఆటో యూనియన్‌ నాయకులు రెడ్డప్పరెడ్డి, షరీఫ్‌, తదితరులు పాల్గొన్నారు.