మొక్కలు నాటిన డాక్టర్ శ్రీధర్
ప్రజాశక్తి-కావలి : కావలి పట్టణంలోని శ్రీధర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వైద్యులు, సంయుక్త సేవా సంస్థ గౌరవ సభ్యులైన డాక్టర్ పి.శ్రీధర్ పుట్టిన రోజు సందర్భంగా శనివారం ముసునూరు గిరిజన గురుకుల బాలికల పాఠశాలలో మొక్కలు నాటారు. కార్యక్రమంలో సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు సురేంద్ర, లోక్‌సత్తా మాలకొండారెడ్డి, పాఠశాల ప్రిన్సిపాల్ శ్యామ్ సుధాకర్, ఐసిడిఎస్ ఉద్యోగి సాయి, ఉపాధ్యాయులు, విద్యార్థినులు పాల్గొని మొక్కలు నాటారు. ఈ సందర్భంగా లోక్‌సత్తా మాలకొండారెడ్డి మాట్లాడుతూ సంయుక్త సేవాసంస్థ ఆధ్వర్యంలో డాక్టర్ పి.శ్రీధర్ పుట్టినరోజు సందర్భంగా మొక్కలు నాటడం అభినందనీయమని తెలిపారు. మానవ మనుగడ కోసం మొక్కలు నాటాల్సిన అవసరం ఎంతో ఉందని, ప్రతిఒక్కరూ మొక్కలు నాటాలని, వాటిని సంరక్షించడానికి కృషి చేయాలని కోరారు. పర్యావరణ పరిరక్షణ కోసం సంయుక్త సేవా సంస్థ అధ్యక్షుడు సురేంద్ర చేస్తున్న కృషి ఆదర్శంగా ఉందని చెప్పారు. ఈ సందర్భంగా పుట్టినరోజు జరుపుకుంటున్న డాక్టర్ పి.శ్రీధర్‌కి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.










