మన్సూర్‌కు ఘననివాళులు
ప్రజాశక్తి-ఆత్మకూరు అర్బన్ : ప్రజా సమస్యలపై నిరంతర పోరాటయోధుడు, అల్లరి మూకల దాడిలో అమరుడైన మన్సూర్ భారు వర్థంతి సందర్భంగా శనివారం నివాళి కార్యక్రమాన్ని ఆత్మకూరు పట్టణంలో ఆవాజ్ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఆవాజ్ కమిటీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఆత్మకూరు పట్టణవాసి పి.యస్ధాని బాషా నిర్వహించిన ఈ నివాళి కార్యక్రమంలో పట్టణ సిపిఎం నేతలు రైతు సంఘ ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజా ఉద్యమాల కోసం నిరంతరం పోరాటం చేస్తూ అల్లరి మూకల ఏర్పాటు వాదాన్ని వ్యతిరేకించిన క్రమంలో వారి చేతిలో హతమై అమరుడైన మన్సూర్‌భారు స్ఫూర్తిని ప్రతి ఒక్కరూ ఆచరించాలని ప్రజా వ్యతిరేక విధానాలన్నీ మన్సూర్ భారు ఎప్పుడు కూడా వ్యతిరేకించే వారిని అటువంటి వారి జీవితాన్ని స్మరించుకుంటూ వారిని నివాళులర్పించడం ఎంతో గౌరవంగా గర్వంగా ఉందని వారు తెలిపారు. కార్యక్రమంలో సిపిఎం పట్టణ కార్యదర్శి డేవిడ్‌రాజు, కౌలు రైతుల సంఘం జిల్లా నేత లక్ష్మీపతి, ఆత్మకూరు మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ సంధాని, ప్రజానాట్యమండలి గద్దర్ బాబు, డివైఎఫ్‌ఐ, సిఐటియు నేతలు, తదితరులు పాల్గొన్నారు.










