Mar 08,2023 21:46

జక్కా పార్వతమ్మకు నివాళులర్పిస్తున్న మహిళలు


జక్కా పార్వతమ్మకు నివాళులర్పిస్తున్న మహిళలు
మన్సూర్‌భవన్‌లో మహిళా దినోత్సవ వేడుకలు
నెల్లూరు:స్థానిక వేదాయపాళెం ప్రాంతంలోని మన్సూర్‌ భవన్‌లో రూరల్‌ ఐద్వా , సిఐటియు , శ్రామిక మహిళా కమిటీల ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు నిర్వహించారు. బుధవారం నిర్వహించిన ఈ వేడుకలకు ఎస్‌ వరలక్ష్మి అధ్యక్షత వహించారు. ఈ వేడుకల్లో ముందుగా ఇటీవల మృతి చెందిన జిల్లా ప్రజా ఉద్యమ నిర్మాత జెక్కా వెంకయ్య సతీమణి జెక్కా పార్వతమ్మ చిత్రపటానికి ప్రముఖ మహిళా న్యాయవాది జెక్కా శేషమ్మ గారిచేత పూలమాల వేయించి నివాళులు అర్పించారు. అనంతరం అంతర్జాతీయ మహిళా దినోత్సవ విశిష్టతను జక్కా శేషమ్మ, అంగన్‌వాడీ జిల్లా కార్యదర్శి షేక్‌ రెహనాబేగం వివరించారు. మహిళల సమస్య పరిష్కారించుకొనేందుకు ఒక వేదిక అవసరమని క్లారా జెట్కీన్‌ భావించారన్నారు., రోజా లజ్బంగర్‌ ల నాయకత్వాన అప్పటి మహిళలు ఎదుర్కొంటున్నా సమస్యల పరిష్కారం కోసం ఎన్నో పోరాటాలు చేశారన్నారు. అటువంటి మహౌన్నత వ్యక్తల పిలుపు మేరకు చేపట్టిన పోరాటాల వల్ల మహిళల ప్రధాన సమస్యలకు పరిష్కారం లభించిందన్నారు
. సిఐటియు , రూరల్‌ కార్యదర్శి కిన్నెర కుమార్‌ అధ్యక్షుడు కొండాప్రసాద్‌ ఐద్వా రూరల్‌ కార్యదర్శి షేక్‌ షాహినా బేగం మాటాడుతూ ఈ మహిళా దినోత్సవం సంధర్భంగా చిన్నారులు మైనర్‌ బాలికల పై జరుగుతున్న దాడులను అరికట్టాలని డిమాండ్‌ చేశారు. అదే విధంగా చట్టసభలనందు మహిళలకు 33% రిజర్వేషన్‌ అమలు పరిచేందుకు చర్యలు తీసుకోవాలని, సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలన్నారు. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుప్రకారం కుటుంబ జీవనానికి కనీసవేతనం రూ.26 వేలు అందజేయాలని డిమాండ్‌ చేశారు. కేరళ ప్రభుత్వం ప్రకటించిన ఋతు క్రమ సెలవులు విధానం ఆంధ్ర రాష్టం ప్రభుత్వం కూడా ఉద్యగ ,కార్మీక , విధ్యార్థిని ల కు 3 దినాల సెలవు సౌకర్యం అందించాలని డిమాండ్‌ చేశారు కార్యక్రమంలో షేక్‌ షంషాద్‌ , యు సుజాత , సంపూర్ణ , ప్రసన్న పర్విన్‌ ఐద్వా జిల్లా మాజీ కార్యదర్శి పి విజయమ్మ , పద్మమ్మ .బుజ్జమ్మ రిజ్వానా రంగయ్య , షబ్బీర్‌ మరియు అంగన్వాడి ,ఆశ ,ఐద్వా మున్సిపల్‌ వర్కర్స్‌ పాల్గొన్నారు.