పూర్తి పేరు : సిద్ధార్థ నారాయణ్
పుట్టిన తేదీ : ఏప్రిల్ 19, 1979
తొలి సినిమా : బాయ్స్ (2003)
అభిరుచులు : నటన, గానం, రచన, రాజకీయాలు
నటించిన సినిమాలు : 30 కి పైగా
భార్య : మేఘన (విడిపోయారు)
సంతానం : ఒక కుమారుడు
సిద్ధార్థ మంచినటుడు. బొమ్మరిల్లు మొదలుకొని అనేక సినిమాలతో ఇప్పటికే తనను తాను నిరూపించుకున్నాడు. నటుడుగానే కాదు; రాజకీయాలపై చురుకైన, కరుకైన వ్యాఖ్యలు చేసేవాడుగానూ సిద్ధార్థ తరచూ వార్తలు కనిపిస్తాడు. తాజాగా బీజేపీ నేతలతో సోషల్ మీడియాలో యుద్ధం సాగిస్తున్నాడు. తాజాగా సిద్ధార్థ్‌ని ప్రముఖ బాలీవుడ్ నటి స్వరా భాస్కర్‌తో పోలుస్తూ కొందరు చేసిన ట్వీట్లకు విభిన్నంగా రియాక్ట్ అయ్యాడు.
హీరోగా తెలుగు, తమిళ ప్రేక్షకులను అలరించిన నటుడు సిద్ధార్థ్ గత కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్నాడు. సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్‌గా ఉంటున్నాడు. సినిమాలతో పాటు సామాజిక అంశాలపై కూడా స్పందిస్తుంటాడు. ముఖ్యంగా బీజేపీకి వ్యతిరేకంగా అతను ఈ మధ్యకాలంలో ట్వీట్లు చేయడం ప్రారంభించాడు. కరోనా వైరస్ కారణంగా దేశ వ్యాప్తంగా ఇంత దుర్భరమైన పరిస్థితి ఏర్పడేందుకు కేంద్రంలో ఉన్న బీజేపీనే కారణమంటూ.. సిద్ధూ ట్వీట్లు చేశాడు.
దీంతో ఆ పార్టీ నేతల నుంచి సిద్ధార్థ్‌పై దాడి మొదలైంది. సిద్ధార్థ్‌ను టార్గెట్ చేస్తూ.. ట్వీట్లు, పోస్టులు చేస్తున్నారు. తనను, తన కుటుంబాన్ని హత్య చేస్తామని, అత్యాచారం చేస్తామని తీవ్రమైన బెదిరింపులు కూడా మొదలయ్యాయి. బీజేపీ నేతలే తనని బెదిరిస్తున్నారంటూ సిద్ధార్థ్ ఈమధ్య ట్వీట్ చేశాడు. దీనిపై పోలీసులకు కూడా ఫిర్యాదు చేసినట్లు తెలిపాడు. ఇటీవల బీజేపీ యువ మోర్చా జాతీయాధ్యక్షుడు తేజస్వీ సూర్యను టార్గెట్ చేస్తూ సిద్ధార్థ్ ఒక ట్వీట్ చేశాడు. తేజస్వీ సూర్య.. అజ్మల్ కసబ్ కంటే ఎంతో ప్రమాదకరమైన వ్యక్తి అంటూ అతను పేర్కొన్నాడు. దీనిపై ఏపీ బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి స్పందించారు. 'సిద్ధార్థ్ సినిమాలు అన్నింటికీ.. దావూద్ ఇబ్రహీం ఫండింగ్ చేస్తాడట.. నిజమేనా..!' ట్వీట్ చేశాశాడు. దీనిపై సిద్ధార్థ్ ఘాటుగా స్పందించాడు.
''నో రా. నాకు టీడీఎస్ ఇవ్వడానికి అతను సిద్ధంగా లేడు. నేను చాలా నిజాయితీ గల పౌరుడిని. పన్ను చెల్లింపుదారుడిని కదరా విష్ణు. వెళ్లి పడుకో. బీజేపీ స్టేట్ సెక్రటరీ అంటా. సిగ్గుండాలి'' అంటూ సిద్ధార్థ్ ట్వీట్ చేశాడు. మరోవైపు కొందరు వ్యక్తులు తనని ప్రముఖ బాలీవుడ్ నటి స్వరా భాస్కర్‌తో పోలుస్తున్నారు అంటూ సిద్ధార్థ్ మరో ట్వీట్ చేశాడు. ''కొందరు హిందీ మాట్లాడే ముఠా నన్ను దక్షిణ భారతానికి స్వరా భాస్కర్ అంటున్నారు. వాళ్లకి నేను స్పష్టంగా చెప్పిది ఒకటే.. నేను ఎప్పుడైనా, ఎక్కడైనా స్వరాలా మారేందుకు సిద్ధమే. ఎందుకంటే ఆమె ఎంతో అందంగా, క్యూట్‌గా ఉంటుంది'' అంటూ సిద్ధార్థ్ ట్వీట్ చేశాడు.
దేశంలో జరుగుతున్న హారర్ స్టోరీని సెలబ్రిటీస్ మౌనం చూడటం ఎంత మాత్రం తగదంటూ గతంలో సిద్ధార్థ ట్వీట్ చేశాడు. కనీసం ప్రజలైనా ప్రశ్నించాలని, ప్రభుత్వాలను నిలదీయాలని కోరాడు. ఈ నేపథ్యంలో బీజేపీ తమిళనాడు నాయకులు అతడిపై విరుచుకుపడుతున్నారు. సిద్ధార్థ ఫోను నెంబర్‌ని లీక్ చేసి, తనను తిట్టమంటూ కార్యకర్తలను ఉసికొల్పారు. ఎంత బెదిరించినా తన నోరు మూయలేరని సిద్ధూ హెచ్చరించాడు. తనను ఫోన్‌లో దూషించిన వారి కాల్స్ రికార్డు చేశానని, సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టిన వారి డీపీలను కాపీ చేశానని వీరిపై పోలీసు కంప్లైట్ ఇస్తున్నానని సిద్ధార్థ తెలిపాడు. ఈ విషయాన్ని ట్వీట్ చేస్తూ ప్రధాని నరేంద్రమోదీ, కేంద్ర హౌం మంత్రి అమిత్ షాను ట్యాగ్ చేశాడు. ప్రజలు ఎదుర్కొనే ఏ విషయం మీద స్పందించని తెలుగు నటుల కన్నా - రాజకీయ పరిణామాలపై, సమస్యలపై తమ వైఖరిని నిర్భయంగా తమిళ నటులు చాలా మెరుగు అనిపిస్తారు.