ఇంపాల్ : మణిపూర్‌లో హంగ్ ఏర్పడింది. బిజెపి 25 స్థానాల్లో ముందజంలో ఉంది. ఈ స్థానాల్లో బిజెపి గెలుపొందితే.. రాష్ట్రంలో అతిపెద్ద సింగిల్ పార్టీగా బిజెపి అవతరించనుంది. నేషనల్ పీపుల్స్ పార్టీ (ఎన్‌పిపి), నాగా పీపుల్స్ ఫ్రంట్ (ఎన్‌పిఎఫ్) కింగ్ మేకర్స్‌గా మారునున్నారు. కాంగ్రెస్ కేవలం 9 స్థానాలతో సరిపెట్టుకుంది. మొత్తం 60 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగ్గా.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు 31 స్థానాలను గెలుపొందాల్సి ఉంటుంది.










