ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : మణిపూర్‌లో బిజెపి స్వల్ప మెజార్టీతో గెలుపొందింది. మ్యాజిక్ ఫిగర్ కంటే ఒక్కస్థానానిు అదనంగా గెలుచుకుంది. గత ఎనిుకలతో పోల్చితే కాంగ్రెస్ బాగా నష్టపోయింది. 60 అసెంబ్లీ స్థానాలు గల మణిపూర్‌లో 31 మ్యాజిక్ ఫిగర్. బిజెపికి 32 స్థానాలు వచ్చాయి. కాంగ్రెస్ ఐదు స్థానాల్లోనే గెలిచింది. గత ఎనిుకల్లో బిజెపి 21 స్థానాల్లో గెలవగా, ఈసారి 32 స్థానాల్లో గెలిచింది. గతసారి 36.3 శాతం ఓట్లు రాగా, ఇప్పుడు 37.8 శాతం ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్ గత ఎనిుకల్లో 28 సీట్లు గెలవగా, ఈసారి 5 స్థానాలతోనే సరిపెట్టుకుంది. అప్పుడు 35.1 శాతం ఓట్లు రాగా, ఇప్పుడు 16.8 శాతం ఓట్లు వచ్చాయి. దాదాపు 19 శాతం ఓట్లను కాంగ్రెస్ కోల్పోయింది.
మొత్తం సీట్లు 60
మ్యాజిక్ ఫిగర్ 31
బిజెపి 32
కాంగ్రెస్ 5
జెడియు 6
ఎన్‌పిపి 7
ఎన్‌పిఎఫ్ 5
కెపిఎ 2
స్వతంత్రులు 3
- 2017లో మణిపూర్‌లో పార్టీలు వారీగా వచ్చిన ఓట్లు
కాంగ్రెస్‌కు 28
బిజెపికి 21
టిఎంసికి 1
ఎన్‌పిఎఫ్ 4
లోక్‌జనశక్తి 1
ఎన్‌పిపి 4
స్వతంత్రులు 1










