ప్రజాశక్తి-పీలేరు: మన కళలు, సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని పీలేరు పంచాయతీ సర్పంచ్ డాక్టర్ షేకహేబీబ్‌బాషా, పట్టణ సిఐ మోహన్‌రెడ్డి తెలిపారు. పాత సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ, నూతన సంవత్సరానికి స్వాగతం పలికేందుకు పీలేరు పట్టణంలోని విఎస్ నర్తనశాలలో దుర్గా గ్యాస్ అధినేత బి.సోమ్లా నాయక్ జ్ఞాపకార్థంగా ఆయన కుమారుడు బి.అమరేంద్ర నాయక్ జానపద సంబరాల రాత్రి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమం ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా హాజరైన సర్పంచ్, సిఐ మాట్లాడుతూ అంతరించిపోతున్న జానపద కళలను కాపాడుకోవడానికి కళాకారులు చేస్తున్న కృషి అభినందనీయమని పేర్కొన్నారు. కార్యక్రమంలో విఎస్ నర్తనశాల నిర్వాహకులు వి.మయూర్‌నాథ్ శర్మ, బైరెడ్డిపల్లి కళాతరంగిణి సంస్థ నిర్వాహకులు రాజేష్, షైన్ బాబ్జాన్, పసుపులేటి వెంకటరమణ, కళాకారులు పాల్గొన్నారు.










