ప్రజాశక్తి-రాయచోటి టౌన్: అన్నమయ్య జిల్లా రాయచోటి మండలంలోని చెన్నముక్కపల్లె రింగ్ రోడ్డు వద్ద మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆయన కుమారుడు రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డిలకు తృటిలో ప్రమాదం తప్పింది. సోమవారం బంధువుల ఇంటికి వెళుతుండగా కాన్వారులోని మిథున్‌రెడ్డికి చెందిన వాహనాన్ని మరో కారు ఎదురుగా వచ్చి ఢకొీట్టింది. ఆ వాహనం పల్టీలు కొట్టింది. వాహనంలో ప్రయాణిస్తున్న ఎంపీ వ్యక్తిగత కార్యదర్శి, భద్రతా సిబ్బందికి తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం వారిని రాయచోటి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మంత్రి పెద్దిరెడ్డి, ఎంపీ మిథున్‌రెడ్డి కుటుంబ సభ్యులంతా సంక్రాంతి వేడుకల్లో పాల్గొనేందుకు పుంగనూరు నుంచి వీరబల్లిలోని అత్తగారింటికి వెళుతుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. మంత్రి పెద్దిరెడ్డి వాహనంలోనే ఆయన కుమారుడు మిథున్‌రెడ్డి కూడా ఉండటంతో వాళ్లకు ప్రమాదం తప్పింది. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ట్రాఫిక్ ఎస్‌ఐ జయరాములు తెలిపారు.










