Jan 09,2023 21:44

ఎమ్మెల్సీ..


 కడప ప్రతినిధి : ఉమ్మడి జిల్లాలో శాసనమండలి ఎన్నికల సందడి మొదలైంది. జిల్లాకు చెందిన నలుగురు ఎమ్మెల్సీల్లో ఇద్దరు టిడిపి ఎమ్మెల్సీలతో పాటు పట్టభద్ర, ఉపాధ్యాయ ఎమ్మెల్సీలకు మార్చితో గడువు ముగియనుంది. అధికార పార్టీకి చెందిన సీనియర్‌ నాయకులకు కేటాయించాల్సి ఉంది. జమ్మలమడుగుకు చెందిన పిఆర్‌, రాయ చోటికి చెందిన ద్వారకనాధరెడ్డిలకు ఎటువంటి పద వులు కేటాయించని నేపథ్యంలో ఎమ్మెల్యే టికెట్‌కు పట్టుబట్టే అవకాశాలు ఉన్నాయి. సిట్టింగ్‌ ఎమ్మె ల్యేలను కాదని టికెట్‌ లభించడం కష్టసాధ్యమైన నేపథ్యంలో అధికార పార్టీ కత్తి మీద సాము చేయాల్సి ఉంది. 2024 సార్వత్రిక ఎన్నికల్లో అమీ తుమీ తేల్చుకోవాలనే ఉద్దేశంతో ప్రతిపక్ష పార్టీలను ఒక్కటి చేసి ఎన్నికల గోదాలో సత్తా చాటాలనే తపిస్తున్న ప్రతిపక్ష టిడిపి ప్రయత్నాలు చేస్తున్న సంగతి తెలిసిందే. అసెంబ్లీ టికెట్‌ లభించని నేతలను గుర్తించి ఎమ్మెల్సీ పదవులను కేటాయించే చాణక్యాన్ని ప్రదర్శించాల్సి ఉంది. ఉమ్మడి జిల్లాకు చెందిన సీనియర్‌ నాయకులకు అవకాశం లభించే అవకాశం ఉందనే అంచనాలు ఉన్నాయి.
ఆ ఇద్దరినీ పదవులు వరించేనా!
ఉమ్మడి జిల్లాలోని జమ్మలమడుగుకు చెందిన మాజీ మంత్రి పి.ఆర్‌, రాయచోటికి చెం దిన మాజీ ఎమ్మెల్యే ద్వారకనాధరెడ్డి ఎమ్మెల్సీ పదవులు కేటాయించే అవకాశాలు ఉన్నాయనే వాదన వినిపిస్తోంది. వైసిపి అధికారంలోకి వచ్చిన ప్పటి నుంచి వీరిద్దరికీ ఎటువంటి నామినేటెడ్‌ పదవులు కేటాయించని నేపథ్యంలో తీవ్ర నిరుత్సాహాన్ని వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. కార్పొరేషన్‌ ఛైర్మన్‌ పదవుల భర్తీ సమయంలోనూ ఊరించి ఉస్సూరుమనిపించిన నేపథ్యంలో చివరి విడతలో ఎమ్మెల్సీ పదవులు కేటాయించే అవ కాశాలు అధికంగా ఉన్నాయని చెప్పవచ్చు. లేని పక్షంలో 2024 సార్వత్రిక ఎన్నికల్లో తిరుగుబాటు బెడదను ఎదుర్కొనే అవకాశం ఉంది. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ సొంత జిల్లాలో పార్టీని సమైక్యంగా ముందుకు తీసుకెళ్లే క్రమంలో ఎమ్మెల్సీ పదవులను కేటాయించాల్సిన అనివార్య పరిస్థితి ఏర్పడింది. లేనిపక్షంలో జమ్మలమడుగు, రాయచోటి అసెంబ్లీ అభ్య ర్థుల జయాపజయాలను ప్రభావితం కావడం తథ్యమనే వాదన వినిపిస్తోంది. సార్వత్రిక ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థులను మినహాయించి ఎమ్మెల్సీ పదవుల నియామకాలను చేపట్టే అవకాశం ఉంది.
పట్టభద్ర, ఉపాధ్యాయ అభ్యర్థుల జోరు
ఉమ్మడి కడప జిల్లాలో ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎన్నికలకు కౌంట్‌డౌన్‌ మొదలవనున్న నేపథ్యంలో అధికార వైసిపి, ప్రతిపక్ష టిడిపి, పిడిఎఫ్‌, ఇతర ఇండిపెండెంట్‌ అభ్యర్థులు ప్రచారం చేసుకుంటున్న సంగ తి తెలిసిందే. వైసిపి అభ్యర్థుల విజ యానికి అందరి తోడ్పాటు అవ సరం. స్థానిక సం స్థల, గవర్నర్‌ కోట్లాల్లో ఎమ్మెల్సీ పదవుల కేటా యింపు వ్యవహారంలో ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అ వసరం ఉరుముతోంది. ఇప్పటికే పట్టభద్రుల, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఓటర్ల నమోదు ప్రక్రియ పూర్తయిన సంగతి తెలిసిందే. రెండు నెలల ముందు నుంచే అభ్యర్థులు ప్రచారమూ చేపట్టిన సంగతి తెలిసిందే.
సంక్రాంతి తరువాత పోరు ఉదృతం
సంక్రాంతి పండుగ అనంతరం ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారమూ తీవ్ర రూపం దాల్చే అవకాశం ఉంది. గత ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార వైసిపి పట్టభద్ర, ఉపాధ్యాయ ఎన్నికలకు జరిగిన పోరులో వెన్నపూస గోపాల్‌రెడ్డి పట్టభద్ర ఎమ్మె ల్సీతో సరిపెట్టుకున్న సంగతి తెలిసిందే. ఆయన ఐదేళ్లు పదవిలో ఉన్నప్పటికీ సామాన్యులకు ఎటువంటి ప్రయోజనమూ ఒనగూడని నేపథ్యంలో సర్వత్రా వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఆయన కుమా రుడు వెన్నపూస రవీంద్రారెడ్డిని అభ్యర్థిగా ప్రకటి ంచిన నేపథ్యంలో గెలుపు అవకాశాలు తక్కువగా ఉన్నాయనే అంచనాలు వినిపిస్తున్నాయి. స్థానిక సంస్థల, గవర్నర్‌ కోటాలకు చెందిన నాలుగు ఎమ్మె ల్సీ పదవుల కేటాయింపుల్లో తగిన జాగ్రత్తలు తీసు కోని పక్షంలో అధికార వైసిపి బోల్తాపడే అవకాశాలు పుష్కలముగా ఉన్నాయనే వాదన వినిపిస్తోంది.