పశ్చిమ రాయలసీమ పట్టభద్ర, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ చెదురుమదురు ఘటనల మినహా ప్రశాంతంగా ముగిసింది. ఎన్నికల కమిషన్ ఆదేశాల నేపథ్యంలో కడప, అన్నమయ్య జిల్లా అధికార యంత్రాంగం సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుంచి సాయంత్రం 6.30 గంటల వరకు పకడ్బందీ బందోస్తు మధ్య పోలింగ్ నిర్వహించింది. కడప, ప్రొద్దుటూరు, పులివెందుల నియోజకవర్గ కేంద్రాల్లోని రెండేసి పోలింగ్ బూత్‌ల పరిధిలో అధికార వైసిపి బరితెగించి టిడిపి ఎమ్మెల్సీ బి.టెక్ రవి వాహనంపై రాళ్ల దాడులు, ప్రొద్దుటూరు ఉక్కు ప్రవీణ్‌కుమార్‌రెడ్డి, అధికార వైసిపి నేత మధ్య ఘర్షణ చోటుచేసుకోవడం, అక్కడక్కడా వైసిపి పోలరైజేషన్‌లో భాగంగా నగదు పంపిణీ, దొంగఓట్లకు పాల్పడడం వంటి స్వల్ప ఘర్షణలు మినహా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ముగియడం ఉపశమనం కలిగించిది. ప్రజాశక్తి - కడప ప్రతినిధి/రాయచోటి
పశ్చిమ రాయలసీమ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉత్కంఠ నెలకొంది. ఎని ్నక బరిలో 39 మంది పట్టబధ్ర, 12 మంది ఉపాధ్యాయ అభ్యర్థులు నిలిచారు. కడప, అన్నమయ్య జిల్లా అధికార యంత్రాంగాలు 212 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. కడప జిల్లాలోని 36 మండల కేంద్రాల్లో 131 పోలింగ్ కేంద్రాల్లో 93 పట్టభద్ర, 38 ఉపాధ్యాయ పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. అన్నమయ్య జిల్లాలోని 30 మండలాల పరిధిలో 81 పోలింగ్ కేంద్రాల్లో 51 పట్టభధ్ర, 30 ఉపాధ్యాయ పోలింగ్ కేంద్రాల్లో పెద్దఎత్తున ఓటర్లు బారులు తీసి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. కడప జిల్లాలోని మరియాపురం పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రం ఆవరణలో ఎండ వేడిమి బారి నుంచి రక్షణకు ఎలాంటి ఏర్పాట్లు చేయకపోవడం విమర్శలకు ఆస్కారాన్ని కలిగించింది.
మధ్యాహ్నం నుంచి ఊపందుకున్న పోలింగ్
జిల్లాలో సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుంచి మధ్యా హ్నం 11 గంటల వరకు పోలింగ్ మందకొడిగా నడిచింది. మధ్యాహ్నం అనం తరం పోలింగ్ వేగం ఊపందుకుంది. జిల్లాలో పోలింగ్ ముగిసే సమయానికి పట్టభధ్ర పోలింగ్ 72.01శాతం, ఉపాధ్యాయ పోలింగ్ 91.31 శాతం, అన్న మయ్య జిల్లాలో పట్టభధ్ర పోలింగ్ 68.31 శాతం, ఉపాధ్యాయ పోలింగ్ 93. 36 శాతం నమోదైంది. ఉభయ జిల్లాల్లోని పోలింగ్ కేంద్రా ల్లో వైసిపి నేతల ఓటింగ్ పోలరైజేషన్ వ్యూహాన్ని పకడ్బందీగా అమలు చేశారు. ఫలితంగానే మధ్యాహ్నం 11 గంటల నుంచి సాయంత్రం 6.30 పోలింగ్‌వేగం ఊపం దుకుంది. రాయచోటి, ప్రొద్దుటూరులోని కొన్ని పోలింగ్ కేంద్రాల్లో సాయంత్రం 6.30 గంటల వరకు పోలింగ్ కొనసాగడం గమనార్హం.
బరితెగించిన అధికార వైసిపి
కడప, ప్రొద్దుటూరు, మైదుకూరు, పులివెందుల నియోజకవర్గాల్లో అధికార వైసిపి బరితెగింపునకు పాల్పడింది. ఫలితంగా జిల్లాలో పలుచోట్ల ఘర్షణ వాతావరణం ఏర్పడింది. జిల్లాలోని పోలింగ్ కేంద్రాల వారీగా వైసిపి నాయకత్వం తమ కేడర్‌ను వినియోగించుకుని ఓటింగ్ పోలరైజేషన్ వ్యూహాన్ని పకడ్బందీగా అమలు చేసింది. కడప, మైదుకూరు, ప్రొద్దుటూరు ప్రాంతాల్లో అధికార వైసిపి పట్టభద్రులకు రూ.వెయ్యి, ఉపాధ్యాయులకు రూ.5 వేలు చొప్పున పోలింగ్ కేంద్రం వెలుపలి ప్రాంతాల్లో తిష్టవేసి పంపిణీ చేయడం విశేషం. మధ్యాహ్నం అనంతరం కడప, అన్నమయ్య జిల్లాలోని మున్సిపల్ ఉర్ధూ పాఠశాల, వేంపల్లి, లింగాల, ప్రొద్దుటూరు, అన్నమయ్య జిల్లాలోని రాయచోటిడైట్, గాలివీడు ప్రాంతాల్లోని ఏజెంట్ల నియామకం పట్ల అభ్యంతరాలు, పలువురు వాలంటీర్ల సహాయంతో పెద్దఎత్తున దొంగఓట్ల జోరు కొన సాగింది. కడప, వేంపల్లి పోలింగ్ కేంద్రాల్లో దొంగఓట్ల పోలింగ్‌ను గుర్తించినప్పటికీ ఆశించిన ఫలితం కనిపించలేదని తెలిసింది.
బి.టెక్ రవి వాహనంపై రాళ్లదాడి
పులివెందుల నియోజకవర్గ పరిధిలోని లింగాల పోలింగ్ కేంద్రం సమీ పంలో టిడిపి ఎమ్మెల్సీ బి.టెక్ రవి వాహనంపై రాళ్లదాడి చోటుచేసు కుంది. అధికార వైసిపి, టిడిపి కార్యకర్తలు బాహాబాహీ తలపడడం తీవ్ర ఉద్రిక్తతలకు దారిసింది. వేంపల్లి మండల పోలింగ్ కేంద్రంలో మధ్యాహ్నం నుంచి జోరుగా దొంగఓట్ల పో లింగ్ చోటుచేసుకుంది. ప్రతిపక్ష, పిడిఎఫ్ అభ్యర్థులు అభ్యంతరాలు వ్యక్తం చేసినప్పటికీ ఆశించిన ఫలితం కనిపించని వాతావరణం ఏర్పడింది. ప్రొద్దుటూరులో అధికార వైసిపి, ప్రతిపక్ష టిడిపి ఇన్‌ఛార్జి ఉక్కు ప్రవీణ్ మధ్య బాహాబాహీ ఘర్షణ వాతావరణం చోటుచేసుకుంది. కడప ఎఎస్‌పి తుషార్ డూడీ, ప్రొద్దుటూరు డిఎస్‌పి జోక్యంతో ఘర్షణ సద్దుమణిగింది.
కడపలో పోలరైజేషన్ జోరు!
జిల్లా కేంద్రమైన కడప మున్సిపల్ ఉర్ధూ పాఠశాల అధికార వైసిపి, ప్రతిపక్ష టిడిపి నేతల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఎర్రముక్కపల్లి సర్కిల్ పరిధిలోని గాంధీనగర్ పాఠశాల పోలింగ్ కేంద్రంలో దొంగఓట్ల చలామణిని అడ్డుకోవడంతో ఘర్షణ వాతావరణం వంటి ఫటనలతో స్వల్ప వివాదాలు చోటుచేసుకోవడం గమనార్హం.










