కోల్‌కతా : తుపాకీతో విద్యార్థులపై బెదిరింపులకు దిగిన ఘటన వెనుక ఎ-జెడ్ ఢిల్లీ కుట్ర ఉందని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ గురువారం వ్యాఖ్యానించారు. ఇది ఉన్మాదపు చర్య మాత్రం కాదని, ఈ ఘటన వెనుక మోడీ ప్రభుత్వ దాగి ఉందని, పోలీసులు సకాలంలో స్పందించడంతో పెద్ద ప్రమాదం తప్పిందని అన్నారు. కుట్ర నుండి రక్షించిన పోలీస్ అధికారులు, మీడియాను అభినందిస్తున్నాని, ఇది పూర్తిగా బిజెపి ప్రభుత్వ కుట్రేనని అన్నారు. ప్రతిపక్షాలు ఎక్కడ అధికారంలో ఉంటే ఆ రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్నారని మండిపడ్డారు. సాధారణ పౌరులు ఈ విధంగా ప్రవర్తించరని అన్నారు. అతను బందీ అనే పదాన్ని ఆ వ్యక్తి ఎక్కడి నుండి నుండి నేర్చుకున్నాడని, ఇటువంటి పనులు చేసే వ్యక్తులు పట్టుపడితే వెంటనే ఉన్మాదిగా ముద్ర వేస్తారని అన్నారు.
పశ్చిమబెంగాల్‌లోని మాల్డాలోని పాఠశాలలో విద్యార్థులను బందిస్తానంటూ ఓ వ్యక్తి తుపాకీతో హల్‌చల్ చేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు వైరల్‌గా మారాయి. డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (లా అండ్ ఆర్డర్) అజహర్ ఉద్దీన్.. తరగతిలోకి ప్రవేశించి దుండగుడి నుండి తుపాకీని తీసుకోగా, విద్యార్థులు బయటకు పరుగులు తీస్తున్న దృశ్యాలు ఆ వీడియోలో కనిపిస్తున్నాయి.










