లక్నో : రాజకీయంగా అత్యంత కీలకమైన ఉత్తరప్రదేశ్‌లో తిరిగి బిజెపి అధికారాన్ని నిలబెట్టుకోగలిగింది. 2017 ఎన్నికల్లో తన హిందూత్వ ఎజెండాతోనే విజయం సాధించిన బిజెపి ఈసారీ అదే కార్డును ఉపయోగించింది. ఎన్నికల ముందు వ్యవసాయ చట్టాలపై ప్రజల్లో రేగిన అసంతృప్తి, లఖింపూర్ ఖేరి పరిణామాలతో బిజెపికి కొంత భయం పట్టుకున్నా చివరకు కుల, మతోన్మాద పోకడలను రెచ్చగొట్టి, ఆర్థిక, అంగ బలంతో అనుకును రీతిలో విజయాన్ని మూటగట్టుకోగలిగింది. కరోనా నేపథ్యంలో ప్రజలు తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో గత రెండేళ్లుగా ఇస్తును ఉచిత రేషన్, కేంద్ర పథకాలను సమర్ధవంతంగా అమలు చేసిన తీరు వంటివి ప్రజల్లో బిజెపి పట్ల కొంత సానుకూలతను కలిగించినట్లు కనిపిస్తోంది. ఎన్నికలకు ముందు మంత్రులతో సహా పలువురు నేతలు పార్టీని వీడినా ఆ ప్రభావం అక్కడికే పరిమితమైంది తప్ప ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌పై కానీ, పార్టీపై గానీ పడలేదు. 2017 అసెంబ్లీ ఎనిుకల్లో 39.7శాతం ఓట్లు రాగా, ఈసారి 42శాతం ఓట్లు వచ్చాయి. ఈ ఎనిుకల్లో మొత్తంగా 376 స్థానాల్లో పోటీచేసి, 255 సీట్లను బిజెపి గెలుచుకుంది. బిజెపి కూటమి మొత్తంగా 270స్థానాలను కైవసం చేసుకుంది. వీటిలో భాగస్వామ్య పార్టీలైన ఎడిఎస్‌కి 11సీట్లు రాగా, ఎన్‌ఎస్‌హెచ్‌డికి ఏడు స్థానాలు వచ్చాయి. ఓట్ల శాతాన్ని పెంచుకోగలిగినా సీట్లు మాత్రం ఈసారి బిజెపికి తగ్గాయి. 2017 ఎనిుకల్లో బిజెపి కూటమికి 322 సీట్లురాగా, బిజెపి 312 స్థానాలను గెలుచుకుంది. అంటే గత ఎన్నికల కనాు బిజెపికి ఈసారి 60 స్థానాలు తగ్గాయి. సమాజ్‌వాదీ పార్టీ కూటమికి మొత్తంగా 128 సీట్లు లభించాయి. ఇందులో ఎస్‌పి 111 సీట్లను గెలుచుకోగా, ఆర్‌ఎల్‌డి 9, ఎస్‌బిఎస్‌పి ఆరు స్థానాలు గెలుచుకునాుయి. గత ఎనిుకల కనాు ఈ ఎన్నికల్లో ఎస్‌పి లాభపడింది. 2017 ఎనిుకల్లో 47స్థానాలకే పరిమితమైన సమాజ్‌వాదీ పార్టీ ఈసారి ఏకంగా 66 స్థానాలను మెరుగుపరుచుకునితన సీట్లను 113కి పెంచుకుంది. గోరఖ్‌పూర్ నియోజకవర్గం నుండి మొదటిసారిగా అసెంబ్లీకి పోటీచేసిన ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ లక్ష ఓట్లకుపైగా మెజారిటీతో విజయం సాధించారు. మరోవైపు సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ కర్హాల్ నియోజకవర్గం నుండి విజయం సాధించారు. మాజీ ముఖ్యమంత్రి మాయావతి నేతృత్వంలోనిబిఎస్‌పి ఒకే ఒక్క స్థానానిు గెలుచుకోగలిగింది. గత ఎనిుకల్లో 19 స్థానాలు గెలుచుకును ఈ పార్టీ ఈసారి ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. కాంగ్రెస్ కేవలం రెండు సీట్లతో సరిపెట్టుకుంది. గత ఎనిుకల్లోనూ రెండంకెలకు చేరని ఈ పార్టీ కనీసం ఏడు స్థానాలను గెలుచుకుంది. అసదుద్దీన్ ఒవైస్ నేతృత్వంలోని ఎఐఎంఐఎంకి కేవలం 0.43శాతం ఓట్లు లభించాయి. గత మూడు దశాబ్దాలుగా రాష్ట్రంలో ఏ పార్టీకి వరుసగా రెండోసారి విజయం లభించలేదు. ఆ రికార్డును తుడిచేయడంతోపాటు పూర్తి పదవీ కాలం పనిచేసిన, బిజెపికి చెందిన మొదటి ముఖ్యమంత్రిగా నిలిచారు.
- రాంపూర్ ఖాస్‌లో 40 ఏళ్లగా కాంగ్రెస్
రాష్ట్రంలో కాంగ్రెస్ పరిస్థితి రోజు రోజుకి దిగజారుతున్నప్పటికీ, 40 ఏళ్లగా రాంపూర్ ఖాస్ నియోజకవర్గంలో కాంగ్రెస్ జెండా ఎగురుతూనే ఉంది. కాంగ్రెస్ అభ్యర్థి ఆరాధనా మిశ్రా, తన సమీప బిజెపి అభ్యర్థి నాగేష్ ప్రతాప్ సింగ్‌పై దాదాపు 15 వేల ఓట్లుకుపైగా ఆధిక్యంతో గెలుపొందారు. ఈ నియోజకవర్గంలో 1980లో మొదటి సారి ఆరాధన మిశ్రా తండ్రి కాంగ్రెస్ సీనియర్ నేత ప్రమోద్ తివారీ గెలుపొందారు. 2014 ఉప ఎన్నికల నుంచి ఆరాధన గెలుస్తున్నారు.
- కుల, మత రాజకీయాలను సమాధి చేశారు : యోగి
బిజెపికి తిరిగి పట్టం కట్టడం ద్వారా ప్రజలు కుల, మత రాజకీయాలను సమాధి చేశారని ముఖ్యమంత్రి యోగి గురువారం వ్యాఖ్యానించారు. రాష్ట్ర పార్టీ కార్యాలయంలో పార్టీ కార్యకర్తలనుద్దేశించి ప్రసంగించారు. ఇవిఎంల పట్ల సందేహాలు వ్యక్తం చేస్తూ ప్రతిపక్షాలు సాగించిన ప్రచారాన్ని ప్రజలు తిప్పికొట్టారని అన్నారు.
- ఫోర్ కొట్టాం : మోడీ
న్యూఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో బిజెపి కార్యకర్తలను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ నాలుగు రాష్ట్రాల ఎన్నికల్లో విజయంతో మ్యాచ్‌లో ఫోర్ కొట్టడం (జీత్ కా చౌకా)'గా అభివర్ణించారు. ఉత్తరప్రదేశ్ చాలా మంది ప్రధాన మంత్రులను ఇచ్చిందని, తొలిసారిగా పూర్తి కాలం పనిచేసిన తర్వాత మళ్లీ ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారని చెప్పారు. సుపరిపాలన మరింత మెరుగ్గా సాగిందన్నారు. గత కొనేుళ్లుగా పారదర్శకంగా, పేదలకువారి హక్కులను అందజేస్తోందన్నారు. బిజెపి కార్యకర్తలు 24 గంటలూ పనిచేసి ప్రజల విశ్వాసానిు గెలుచుకోవడంలో విజయం సాధించారనాురు. మణిపూర్, ఉత్తరప్రదేశ్, గోవాలలోనూ బిజెపి ఓట్ల శాతం పెరిగిందన్నిరు. గోవాలో అన్ని ఎగ్జిట్ పోల్స్ తప్పని తేలిందని, గోవా ప్రజలు వరుసగా మూడోసారి వారికి సేవ చేసే అవకాశం ఇచ్చారని చెప్పారు. ''యుపి ప్రజల నుండి నేను పొందిన ప్రేమ. పార్లమెంటు సభ్యునిగా వారణాసి నుంచి ననుు యు.పి.గా మార్చారు. వాలా,'' అని అన్నారు.
- పంజాబ్‌లో...
ప్రజల తీర్పును అంగీకరిస్తున్నా : పంజాబ్ కాంగ్రెస్ అధ్యక్షుడు నవజ్యోత్‌సింగ్ సిద్ధూ
ఇది ప్రజా తీర్పు. ప్రజల ఆదేశాన్ని వినయంగా అంగీకరిస్తున్నాం. ఆప్‌కు అభినందనలు'' అని చెప్పారు. అమృత్‌సర్ తూర్పు నుంచి పోటీపడిన సిద్ధూ ఓటమి చెందారు. పంజాబ్ సీఎం చరణ్‌జిత్ సింగ్ చనీు పరిస్థితి మరీ దారుణం. పోటీ చేసిన రెండు స్థానాల్లో ఆయన ఓటమిపాలయ్యారు. పంజాబ్ మాజీ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్ తన ఓటమిపై స్పందించారు. ప్రజల తీర్పును స్వీకరిస్తునుట్టు చెప్పారు.










