Jun 06,2023 20:15

ఫొటో : ర్యాలీ ప్రారంభిస్తున్న ఆరోగ్య సిబ్బంది

మలేరియా నివారణకు అవగాహన ర్యాలీ
ప్రజాశక్తి-సీతారామపురం : మలేరియా వారోత్సవాలలో భాగంగా మంగళవారం సీతారామపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నుండి ఆరోగ్య కేంద్ర సిబ్బంది ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్‌ స్వప్న మాట్లాడుతూ కిటక జనీత వ్యాధులైన మలేరియా, డెంగీ, చికెన్‌ గున్యా, పైలేరియా మొదలగు వ్యాధులు దోమ కాటు వల్ల సంభావిస్తాయని దోమకాటు బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని,
ప్రతి శుక్రవారం డ్రై డే - ఫ్రై డే కార్యక్రమం ప్రతి ఒక్కరూ సక్రమంగా నిబద్ధతతో నిర్వర్తించాలని తద్వారా దోమల అభివృద్ధిని నిరోధించవచ్చనే సూచనలిస్తూ, రాత్రి వేళల్లో దోమతేరలు వాడటం శరీరాన్ని పూర్తిగా కప్పి ఉంచే దుస్తులు వాడటం దోమలు ఇంట్లోకి ప్రవేశించకుండా తలుపులు, కిటికీలకు మెస్‌ వాడటం మంచిదన్నారు. కార్యక్రమంలో గురించి సిహెచ్‌ఒ మంజులమ్మ, ఎంపిహెచ్‌ఇఒ ఎస్‌కె.మజీద్‌, ఎంపిహెచ్‌ఎలు తిరుపాల్‌ రెడ్డి, దుగ్గిరెడ్డి, ఎఎన్‌ఎంలు ఆశాలు తదితులున్నారు.