May 04,2023 18:26

మజ్జి చలి వేంద్రాన్ని ప్రారంభిస్తున్న దృశ్యం

ప్రజాశక్తి -పొదలకూరు :జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన పెంచలకోన పెనుశిల లక్ష్మీ నరసిం హస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం నసింహ జయంతిని పురస్కరించుకొని పంచాయతీ బస్టాండు ఆవరణంలో శ్రీ వెంకటేశ్వర బోర్‌ వెల్స్‌ నిర్వహకులు చొప్పా వెంకటేశ్వర్లు మజ్జిగ చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. పొదలకూరు సిఐ సంగమేశ్వర రావు రిబ్బన్‌ కట్‌ చేసి, ఈ మజ్జిగ చలివేంద్రాన్ని ప్రారంభించారు. భక్తులకు,ప్రయాణికులకు మజ్జిగ పంపిణీ చేశారు.ఈ సందర్భంగా సిఐ సంగమేశ్వర రావుచ మజ్జిగ చలివేంద్రం ఏర్పాటు చేసిన భక్తుడు చొప్పా వెంకటేశ్వర్లు మాట్లాడారు. దేవరం రఘురామిరెడ్డి,కె. కష్ణమ నాయుడు, ఛత్రపతి మస్తాన్‌, కొమ్మి వేణుగోపాల్‌,డి. ప్రసాద్‌, చిరంజీవి, కొండారెడ్డి ,రాజేష్‌ శ్రీనివాసులు ,రాధాకష్ణ ,మనోజ్‌ పాల్గొన్నారు.