ప్రజాశక్తి -పెనుకొండ :రాష్ట్రంలో ప్రజా సంక్షేమం తెలుగుదేశం పార్టీతోనే సాధ్యమవుతుందని శ్రీసత్యసాయి జిల్లా అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే బికె. పార్థసారథి పేర్కొన్నారు. బుధవారం పట్టణంలోని టిడిపి కార్యాలయంలో మండలంలోని తెలుగుదేశం పార్టీ నాయకులు,కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రాభివృద్ధి టిడిపితోనే సాధ్యమన్నారు. చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన మినీ మేనిఫెస్టోని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలన్నారు. ఈనెల 25వ తేదీన తెలుగుదేశం పార్టీ చేపట్టిన భవిష్యత్తుకు గ్యారెంటీ చైతన్య రథం పేరుతో పెనుకొండ నియోజకవర్గం జరిగే యాత్ర ను విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీడీపీ జిల్లా కార్యనిర్వహక కార్యదర్శి మునిమడుగు చిన్నవెంకటరాముడు, మండల కన్వీనర్ సిద్దయ్య, టౌన్ కన్వీనర్ రవిశంకర్,మహిళా టౌన్ కన్వీనర్ గాయిత్రి, కేశవయ్య, పాలడుగు చంద్ర, రఘువీర చౌదరి, శ్రీనివాసులు, సుబ్బరాయుడు, బోయనాగరాజు, హుజూర్, లక్ష్మినారాయణ రెడ్డి, జావీద్ తదితరులు పాల్గొన్నారు.
ధర్మవరం టౌన్ : వైసీపీ ప్రభుత్వంలో అన్ని వర్గాలు పడుతున్న కష్టాలు చూసిన తర్వాతే టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ప్రజల భవిష్యత్తుకు గ్యారెంటీ ఉండేందుకు మినీ మ్యానిఫెస్టోను ప్రకటించారని ధర్మవరం టీడీపీ నియోజకవర్గ ఇన్‌ఛార్జి పరిటాలశ్రీరామ్ అన్నారు. భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమాన్ని పట్టణంలో బుధవారం నిర్వహించారు. నారాచంద్రబాబునాయుడు ప్రకటించిన మినీమెనిఫెస్టో కరపత్రాలను ఇంటింటికి పంచి పథకాల గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు కమతం కాటమయ్య, చింతలపల్లి మహేష్ చౌదరి, మేకల రామాంజనేయులు,పరిసే సుధాకర్ ,కష్ణాపురం జమీర్ అహ్మద్, షరీఫ్,చట్ట లక్ష్మీనారాయణ, సంజీవులు, పల్లపు రవీంద్ర,పల్లపు శివశంకర్, కృష్ణమూర్తి, కరెంట్ ఆది కార్యకర్తలు పాల్గొన్నారు.
మడకశిర :తెలుగుదేశం పార్టీ మినీ మేనిపోస్ట్‌ను ప్రజల్లోకి తీసుకెళ్లాలని మాజీ ఎమ్మెల్యే ఈరన్న కోరారు. భవిష్యత్తుకు గ్యారంటీ చైతన్య రథం కార్యక్రమంపై ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈనెల 26న మడకశిర నియోజకవర్గంలో జరిగే యాత్రను జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు పాండురంగప్ప, ఆదినారాయణ, అశ్వత్థామప్ప, ఉగ్రనరసింహ, వీరకేతరాయ, కెంచప్ప తదితరులు పాల్గొన్నారు.
రామగిరి : టీడీపీ అధినేత చంద్రబాబు ప్రకటించిన మినీ మెనిఫెస్టోను ప్రతి ఇంటికీ చేర్చాల్సిన బాధ్యత కుటుంబ సాధికార సారధులదేనని మాజీ మంత్రి పరిటాల సునీత అన్నారు. ఇటీవల రాజమండ్రిలో జరిగిన మహానాడులో చంద్రబాబు ప్రకటించిన మినీ మ్యానిఫెస్టో ప్రచార కార్యక్రమానికి సంబంధించి కీలక సమావేశం నిర్వహించారు. రామగిరి మండలం వెంకటాపురంలోని తన స్వగృహంలో రామగిరి మండల పరిధిలోని టిడిపి నాయకులు, క్లస్టర్, సెక్షన్ ఇన్‌ఛార్జులతో సమావేశం నిర్వహించారు. ముఖ్యంగా మెనిఫెస్టోలోని ఆరు ముఖ్యమైన అంశాల గురించి సునీత వివరించారు.










