ప్రజాశక్తి-చందర్లపాడు
మోటార్లకు మీటర్లు బిగించడాన్ని నిరసిస్తూ తెదేపా నేతలతో కలిసి ,కౌలు రైతుసంఘం జిల్లా కార్యదర్శి చనుమోలు సైదులు మండలంలోని చింతలపాడు గ్రామం విద్యుత్ సబ్ స్టేషన్ వద్ద శనివారం నిరసన చేపట్టారు. అనంతరం విద్యుత్ శాఖ అధికారులకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా కౌలు రైతు సంఘం జిల్లా నాయకులు చనమోలు సైదులు మాట్లాడుతూ మోటార్లకు మీటర్లు బిగించకుండా రాష్ట్ర ప్రభుత్వం దిగి వచ్చేంతవరకు పోరాటం కొనసాగిస్తామని అన్నారు. మాజీ శాసనసభ్యురాలు తంగిరాల సౌమ్య, తెలుగుదేశం పార్టీ జిల్లా మాజీ ప్రధాన కార్యదర్శి కోట వీరబాబు, మండల పార్టీ అధ్యక్షులు మేకల సుధాకర్, బొందలపాటి రామకష్ణ, దాసరి ప్రభు, బొందలపాటి రామలింగేశ్వరరావు, రైతులు పాల్గొన్నారు.










