మీ మొబైల్ నెంబర్‌ను ఆధార్‌తో లింక్ చేయాలని.. లేకపోతే చాలా ప్రయోజనాలను పొగొట్టుకుంటారని మెసేజ్‌లు వస్తుంటాయి. దీని కోసం ఆధార్ సెంటర్‌కు వెళ్లి గంటల తరబడి ఎదురుచూడాల్సిన అవసరం లేదు. సులభతరంగా మీ మొబైల్‌లోనే ఆధార్‌తో మీ ఫోన్ నెంబర్‌ను లింక్ చేయవచ్చు. అదెలాగో చూద్దాం...
ask.uidai.gov.in లింక్‌ను ఓపెన్ చేసి అందులో మీరు నమోదు చేయాలి అనుకున్న కొత్త మొబైల్ నెంబర్‌ను ఎంటర్ చేయాలి.
ఆనంతరం మీ మొబైల్‌కు ఓటీపి వస్తుంది.
ఆ ఓటీపితో లాగిన్ కావాలి.
అప్‌డేట్ ఆధార్ అనే ఆప్షన్‌లోకి వెళ్లి మీరు ఇచ్చిన మొబైల్ నెంబర్ కింద ఆధార్ డీటెయిల్స్ ఇవ్వాలి. ఆనంతరం వచ్చిన ఓటీపీని ఎంటర్ చేసి సేవ్ అండ్ ప్రోసెస్ చేయాలి.
తరువాత ఆధార్ ఆప్డేట్ కోసం రూ.25 చెల్లించాల్సి ఉంటుంది. ఆ మొత్తాన్ని ఆధార్ సెంటర్‌లో చెల్లించాలి. దానికోసం ఆన్‌లైన్‌లో స్లాట్ బుక్ చేసుకొని సెంటర్‌కు వెళ్లి చెల్లించాలి.










