Feb 06,2023 20:09

ధర్నాలో నినాదాలు చేస్తున్న వ్య.కా.స.నాయకులు

ప్రజాశక్తి-రాయచోటిటౌన్‌: మిగులు భూములు పంపిణీ చేయాలని కెవిపిఎస్‌ ఆధ్వర్యంలో సోమవారం కలెక్టర్‌ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు ఈసందర్భంగా సంఘం జిల్లా కో- కన్వీనర్‌ డి.సి. వెంకటయ్య మాట్లాడుతూ జిల్లావ్యాప్తంగా ఉన్న మిగులు భూములను ఆరులైన పేదలకు పంచాలని, వారి అనుభవంలో ఉన్న భూములకు పట్టాలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. అక్రమంగా ఆన్‌లైన్‌ చేసుకున్న వాటిని తొలగించాలని, జస్టిస్‌ పున్నయ్య కమిషన్‌ సిఫారసులను అమలు చేయాలని కోరారు. వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి మాట్లాడుతూ వ్యవసాయ కూలీలకు ఉపాధి కల్పించాలని, ఉపాధి కూలీలకు 200 రోజులు పని దినాలు కల్పించాలని, రోజుకు రూ. 600 కూలి ఇవ్వాలని వారు కోరారు. కెవిపిఎస్‌ జిల్లా కన్వీనర్‌ ఓ పెంచలయ్య మాట్లాడుతూ ప్రతి పేదవారికీ ఇళ్లు, ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలన్నారు. కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్‌ రైతు సంఘం జిల్లా కార్యదర్శి చిరుపురు రామచంద్ర, ఉపాధ్యక్షు లు నాగసిరెడ్డి , మండల కార్యదర్శి కె.వి రమణ, అంజి, సురేంద్ర, చెన్నూరు హరికష్ణ ఆది శివ , వెంకటేశు, కె. నాగేష్‌, రైతు నాయకుడు జంగయ్య పాల్గొన్నారు.