Apr 11,2023 20:44

ఫూలే చిత్రపటానికి పూలమాలేసి నివాళులర్పిస్తున్న జెసి

ఫూలే చిత్రపటానికి పూలమాలేసి నివాళులర్పిస్తున్న జెసి
మహనీయులు మహాత్మజ్యోతిబా పూలే
నెల్లూరు:సమసమాజ స్థాపనకు కారణభూతులైన మహాత్మా జ్యోతి బా పూలే లాంటి మహనీయుల అడుగు జాడల్లో నడుచుకుంటూ వారి ఆశయాలను ముందు తరాలకు అందించాల్సిన బాధ్యత మనందరిపై ఉందని ఇంచార్జీ జిల్లా కలెక్టర్‌ ఆర్‌. కూర్మనాథ్‌ పేర్కొన్నారు. మంగళవారం మహాత్మ జ్యోతిబా పూలే 197వ జయంతిని పురస్కరించుకొని కలెక్టరేట్‌ లోని తిక్కన ప్రాంగణంలో వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా మహాత్మ జ్యోతిబా పూలే చిత్ర పటానికి ఇంచార్జీ జిల్లా కలెక్టర్‌ శ్రీ ఆర్‌. కూర్మనాథ్‌, నగర మేయర్‌ పొట్లూరి స్రవంతి, జిల్లా రెవెన్యూ అధికారి వెంకట నారాయణమ్మ పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఇంచార్జీ జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ, సమసమాజ స్థాపనకు కారణభూతులైన మహాత్మా జ్యోతి బా పూలే లాంటి మహనీయుల సేవలను గుర్తించుకొని ప్రభుత్వం మహనీయుడి జయంతిని రాష్ట్ర పండుగగా జరుపుకుంటున్నామన్నారు. ఎందరో మహనీయుల కషి ఫలితంగా స్వాతంత్య్రం వచ్చిందని, ఆనాడు సమాజంలో అనేక రుగ్మతలు, దురాచారాలు నెలకొన్న పరిస్థితులలో వాటిని రూపుమాపేందుకు మహాత్మా జ్యోతి బా ఫూలే, డా. బి.ఆర్‌. అంబేడ్కర్‌ వంటి మహనీయుల కషీవలన సమసమాజ స్థాపన జరిగి నేడు సమాజంలో మార్పు రావడం జరిగిందన్నారు. విద్యతోనే సమన్యాయం, అభివద్ధి సాధ్యమని నమ్మిన మహాత్ముడు జ్యోతిబా పూలే అని పేర్కొన్నారు.
మహిళా అభ్యున్నతికి, బాలికా విద్యా వ్యాప్తికి వారు చేసిన కషి స్పూర్తిదాయకమన్నారు. సమసమాజ స్థాపన కోసం, అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం కషి చేసిన మహనీయులు మహాత్మా జ్యోతి బా ఫూలే అని, ఇలాంటి మహనీయులను గుర్తించుకొని వారిని స్ఫూర్తిగా తీసుకొని వారి ఆశయాలను భావి తరాలకు అందించాల్సిన బాధ్యత మనందరిపై వుందన్నారు. నగర మేయర్‌ పోట్లూరి స్రవంతి మాట్లాడుతూ, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం అందరికీ సమానత్వం కావాలని పోరాడిన మహనీయులు మహాత్మా జ్యోతి బా పూలే అని, నేటి యువత వారి జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకుని ముందుకు వెళ్లాలని అన్నారు. సాంఘిక సంక్షేమ శాఖ ఉప సంచాలకులు వెంకటయ్య, ఐటిడిఏ పిఓ డా. మందా రాణి, వివిధ బిసి సంఘాల నాయకులు బెజవాడ ఆదిశేషయ్య, లీలాకష్ణ యాదవ్‌, శ్రీహరిరావు తదితరులు మాట్లాడుతూ, గొప్పసంఘ సంస్కర్తగా సమసమాజ స్థాపనకు మహాత్మా జ్యోతి బా పూలే చేసిన కషిని గుర్తు చేసుకుంటూ, వారి చేసిన సేవలను కొనియాడారు.ఈ సందర్భంగా విద్యార్థులచే నిర్వహించిన సాంస్కతిక కార్యక్రమాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి.ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి వెంకటనారాయణమ్మ, మెప్మా పిడి రవీంద్ర, కార్మిక శాఖ డిప్యూటీ కమిషనర్‌ వెంకటేశ్వర రావు, ఇరిగేషన్‌ ఎస్‌.ఈ కష్ణమోహన్‌, జిల్లా మైనారిటీ వెల్ఫేర్‌ అధికారి కనక దుర్గ భవాని, పశుసంవర్ధక శాఖ జెడి మహేశ్వరుడు, వివిధ బిసి సంఘాల నాయకులు, విద్యార్ధులు తదితరులు పాల్గొన్నారు.