Mar 15,2023 21:56

ర్యాలీలో పాల్గొన్న అధికారులు, మహిళలు

అమరాపురం : సమాజంలో మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని మండల సమైక్య అధ్యక్షురాలు లలితమ్మ పిలుపునిచ్చారు. మండల కేంద్రంలోని వైఎస్‌ఆర్‌ మహిళ మండల సమైక్య కార్యాలయంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని మండల సమాఖ్య అధ్యక్షురాలు లలితమ్మ ఆధ్వర్యంంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎపిఎం తిప్పన్న, సీసీలు సన్నప్ప, భాస్కర్‌, గోవిందరాజు, వక్కలిగ సంఘం డైరెక్టర్‌ గగన తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రస్తుత సమాజంలో మహిళలు వ్యాపార రాజకీయ విద్య తదితర రంగాలతో రాణించాలన్నారు. అనంతరం ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆనిమేటర్లు హనుమంతరాయ, హనుమక్క, ఈరన్న, స్వామి, రవీంద్రతోపాటు అధికసంఖ్యలో మహిళలు పాల్గొన్నారు.
తలుపుల : స్థానిక జీవనజ్యోతి మండల సమాఖ్య కార్యాలయంలో వెలుగు మండల సమాఖ్య అధ్యక్షురాలు గౌసియా ఆధ్వర్యంలో మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంంలో ఎపిఎం బాబ్జి, ఎంపిడిఒ రమానాయక్‌, ఇఒఆర్‌డి శకుంతల పాల్గొన్నారు.
నల్లచెరువు : మండల కేంద్రంలోని శ్రీ ఆంజనేయ స్వామి మండల సమాఖ్య ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంక్‌ మేనేజర్‌ ప్రభావతి, ఎపిఎం వెంకట రమణమ్మ మునెప్ప, సీసీలు హనుమంతు, ప్రవీణ్‌ కుమార్‌, కదిరప్ప, ఎంఎస్‌ఎ సుగుణమ్మ, విఒలు, మండల సమాఖ్య సభ్యులు, మహిళలు పాల్గొన్నారు.
కదిరి టౌన్‌ : మహిళలు ఆర్థిక స్వాలంబన చెందాలని ఎంపీడీవో సుధామణి, ఎపిఎం శారద సూచించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకొని కదిరి మండలం ఖాద్రి ఎంఎస్‌లో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాల్లో రాణించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎపిఎం రవీంద్ర, సిసిలు, అనిమేటర్లు, మహిళలు పాల్గొన్నారు.