Mar 10,2023 21:08

- మహిళలను సన్మానిస్తున్న కలెక్టర్‌ గిరీష

రాయచోటి : మహిళలు అన్ని రంగాలలో రాణించి ముందుకు వెళ్లాలని కలెక్టర్‌ గిరీష పేర్కొన్నారు. శుక్రవారం కలెక్టరేట్‌లో జిల్లా సమాఖ్య వారి అద్వర్యంలో మహిళలకు ఆటల పోటీలు నిర్వహించి ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఆటల పోటీలలో గెలుపొందిన మహిళలకు కలెక్టర్‌ చేతుల మీదుగా ప్రశంస పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాలలో రానించి ముందుకు వెళ్లాలన్నారు. ప్రస్తుత సమాజంలో మహిళలు ప్రతి రంగంలో ముందున్నారని జిల్లా ప్రతి మహిళా విద్యావంతురాలై ఆర్థికంగా అభివ ద్ధి చేయాలన్నారు. జాయింట్‌ కలెక్టర్‌ తమీమ్‌ అన్సారీయ మాట్లాడుతూ సమాజంలో మహిళలందరూ పురుషులతో సమానంగా అన్ని రంగాల్లో రాణిస్తున్నారని ఈ పోటీ ప్రపంచంలో మహిళలు అన్ని రంగాలలో రాణించడం ప్రతి ఒక్కరు గర్వించదగ్గ విషయమన్నారు. మహిళలు ఏ సమస్య వచ్చినా భయపడకుండా ధైర్యంగా ఎదుర్కోని ముందుకు వెళ్లాలన్నారు. డిఆర్‌డిఎ జిల్లా సమాఖ్య అధ్వర్యంలో సమాఖ్య సభ్యులకు వివిధ రకాల ఆటల పోటీలు నిర్వహించడం జరిగినది. అనంతరం స్పందన హాల్లో సమావేశం ఏర్పాటు చేసి డిఆర్‌డిఎ పీడీ సత్యనారాయణ మహిళా దినోత్సవం యొక్క ప్రాముఖ్యతను వివరించారు. ఈ సందర్భంగా మహిళా అధికారులను ఘనంగా సత్కరించి ఆటల పోటీలలో పాల్గొన్న వారికి బహుమతులు ప్రధానం చేశారు. కార్యక్రమంలో జిల్లా సమాఖ్య అధ్యక్షురాలు మైథిలి, జిల్లా నలుమూలల నుండి డిఆర్‌డిఎ మహిళా సిబ్బంది, మండల సమాఖ్యల లీడర్లు పాల్గొన్నారు.