Mar 10,2023 22:06

ఎస్పీ కార్యాలయంలో కేక్‌ కట్‌ చేస్తున్న డీఎస్పీ, మహిళా ఉద్యోగులు

పుట్టపర్తి రూరల్‌ : మహిళలు అన్ని రంగాల్లో ముందుండి రాణించాలని జిల్లా కలెక్టర్‌ పి.బసంత్‌ కుమార్‌ పిలుపునిచ్చారు. శుక్రవారం పుట్టపర్తి పట్టణంలోని ఎంపీడీవో కార్యాలయంలో ఐసిడిఎస్‌, ఇండియన్‌ రెడ్‌ క్రాస్‌ సొసైటీ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ప్రతి పనికి సమయం కేటాయించడం చాలా ముఖ్యమనానరు. భార్యాభర్తలిద్దరూ ఉద్యోగాలు చేస్తున్నప్పుడు పిల్లల పట్ల చాలా శ్రద్ధ పెట్టాలన్నారు. తల్లి తన బాధ్యతలను విస్మరించకూడదని, బిడ్డలతో ఉదయం, సాయంత్రం తప్పనిసరిగా సమయం కేటాయించాలని సూచించారు. పిల్లల ప్రవర్తన ఎక్కువ శాతం తల్లిదండ్రుల శిక్షణ పై ఆధారపడి ఉంటుందన్నారు. ప్రతి గ్రామ సచివాలయాలలో 60శాతం మంది మహిళలే ఉన్నారని చెప్పారు. సుస్థిరాభివృద్ధి లక్ష్యంలో జిల్లా ప్రథమ స్థానంలో ఉండే విధంగా ఐసీడీఎస్‌, విద్య, వైద్య శాఖలు కలిసి మంచి ఫలితాలు సాధించాలని తెలిపారు. నూటికి నూరు శాతం మహిళలు రక్తహీనతతో బాధపడుతూ ఉంటారని వారిని వారిని గుర్తించి వారికి మంచి వైద్య సేవలు అందించాలని సూచించారు. గర్భిణులకు, వారి ప్రసవానంతరం అందించే సేవలు, అనీమియా వంటి వాటిపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. ఈ సమావేశంలో డిఇఒ మీనాక్షి, సోషల్‌ వెల్ఫేర్‌ డిడి శివ రంగ ప్రసాద్‌, డిఎంహెచ్‌ఒ డాక్టర్‌ కృష్ణారెడ్డి, ఐసిడిఎస్‌ పీడీ లక్ష్మి కుమారి, ఐసిడిఎస్‌ నోడల్‌ ఆఫీసర్‌ గాయత్రి, ఎన్జీవో సంస్థ ప్రతినిధి భానుజ, హ్యాపీ హోం ఎన్జీవో సంస్థ ప్రతినిధి రజితతో పాటు ఆయా శాఖల అధికారులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.
గాండ్లపెంట : మహిళలను అన్ని రంగాలలో రాణించాలని ఎపిఎం సూర్యనారాయణ కోరారు. శుక్రవారం ప్రగతి మండల సమైక్య ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వ్యవసాయ అధికారి లక్ష్మీప్రియ, ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్‌ మేనేజర్‌ లక్ష్మి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహిళలను అన్ని రంగాలలోన రాణించాలన్నారు. మహిళా సంఘాలు సక్రమంగా పొదుపు చేసుకొని బ్యాంకు లావాదేవీలు జరిపి ఆర్థికంగా ఎదగాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సీసీలు రామ్మోహన్‌ రెడ్డి, చెన్నకేశవులు, వరప్రసాద్‌, షాకీర్‌ ,మహిళ సమైక్య అధ్యక్షురాలు సంధ్యారాణి, కార్యదర్శి శైలజ కుమారి తదితరులు పాల్గొన్నారు.
పుట్టపర్తి రూరల్‌: జిల్లా ఎస్పీ రాహుల్‌ దేవ్‌ సింగ్‌ ఆధ్వర్యంలో జిల్లా పోలీస్‌ కార్యలయంలో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేడుకలు నిర్వహించారు. జిల్లా పోలీస్‌ కార్యలయం లో పనిచేస్తున్న మినిస్టీరియల్‌ స్టాఫ్‌ను, కదిరి డీఎసీప భవ్య కిషోర్‌ను, ఎఆర్‌ విభాగంలో మహిళ కానిస్టేబుళ్లను మహిళ హోంగార్డులను ఈసందర్భంగా ఎస్పీ సన్మానించారు. నవసమాజ నిర్మాణంలో సగభాగమైన స్త్రీ సమానత్వమే ప్రగతికి మూలం అన్నారు..ఈ కార్యక్రమంలో బాగంగా గత ఏడాది జూలై నెలలో జిల్లా పోలీస్‌ కార్యలయం లో విధులు నిర్వర్తిస్తూ అనారోగ్య కారణాలతో మరణించిన హోంగార్డు ఎ. చెన్నరాయుడు కుటుంబ సభ్యులకు శుక్రవారం యాక్సిస్‌ బ్యాంక్‌ ప్రమాద బీమాకింద రూ. 30 లక్షల విలువైన చెక్కును అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎఆర్‌ డీఎస్పీ విజరు కుమార్‌, ఎఎఒ సుజాత, జిల్లా పోలీస్‌ కార్యాలయ మహిళా సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
రొద్దం : అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా శుక్రవారం మండలంలోని పెద్దమంతురు సచివాలయ మహిళ సిబ్బందిని ఘనంగా సన్మానించారు. సర్పంచులకు, ఎంపిటిసిలకు, సచివాలయ, వైద్యసిబ్బందిని సన్మానించారు.