పుట్టపర్తి అర్బన్ : మహిళలపై జరుగుతున్న హింస నిర్మూలనకు ప్రతి ఒక్కరూ ముందడుగు వేయాలని కలెక్టర్ బసంత్ కుమార్ పిలుపునిచ్చారు. శుక్రవారం ఉదయం పుట్టపర్తి ఎంపీడీవో కార్యాలయంలో ఐసిడిఎస్, వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ''ప్రపంచ స్త్రీలపై జరిగే హింస వ్యతిరేక పక్షోత్సవాల'' కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్‌తో పాటు అడిషనల్ ఎస్పీ రామకష్ణ ప్రసాద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మహిళలపై జరిగే హింసకు ప్రధాన కారణం పురుషాధిక్యత, పిత స్వామ్యవ్యవస్థ అన్నారు. సమాజంలో పిల్లలను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత ఐసిడిఎస్ పరిధిలో ఉందని తెలిపారు. బాలింతలు, గర్భిణులకు మంచి పౌష్టిక ఆహారం అందించే కార్యక్రమాలు చేపట్టాలని తెలిపారు. అడిషనల్ ఎస్పీ రామకష్ణ ప్రసాద్ మాట్లాడుతూ స్త్రీలపై జరుగు హింసకు వ్యతిరేకంగా ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టాలను ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలన్నారు. నేటికీ కూడా దేశంలో చాలామంది స్త్రీలకు గహహింస చట్టంపై సరైన అవగాహన లేదని దీని వల్ల చట్టాలను ఉపయోగించుకోలేక హింసకు గురవుతున్నారన్నారు. హింస నుంచి విముక్తి పొందడానికి పోలీసుల సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులు, మహిళలు పాల్గొన్నారు.










