Feb 03,2023 22:14

ఫొటో : మాట్లాడుతున్న ఐద్వా మండల అధ్యక్షురాలు మూలి ప్రమీల

మహిళలపై దాడులను అరికట్టాలి : ఐద్వా
ప్రజాశక్తి-మర్రిపాడు : ప్రస్తుత సమాజంలో మహిళలు, చిన్నారులపై అఘాయిత్యాలు ఎక్కువయ్యాయని, వాటిని అరికట్టాలని ఐద్వా మండల అధ్యక్షురాలు మూలి ప్రమీల ఆవేదన వ్యక్తం చేశారు. గడచిన ఐదు నెలల కాలంలో బుజబుజనెల్లూరులో 9వ తరగతి విద్యార్థిని మేఘనపై మేనమామ నాగరాజు యాసిడ్‌ దాడిలో తీవ్రంగా గాయపడి చెన్నరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిందని తెలిపారు. ఈ ఘటనను నిరసిస్తూ స్థానిక కస్తూర్భా గాంధీ బాలికల విద్యాలయం, ప్రభుత్వ జూనియర్‌ కాలేజీ, కదిరినేనిపల్లి ప్రాథమికోన్నత పాఠశాలలో రామానాయుడుపల్లి హైస్కూల్‌లో విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహిళలు ఇంట్లో ఉన్న, బయటకు వెళ్లినా దాడులు ఎక్కువయ్యాయని, ప్రభుత్వం మహిళలపై జరిగే దాడులను అరికట్టాలని డిమాండ్‌ చేశారు.
మృతి చెందిన బాలిక కుటుంబానికి ప్రభుత్వం రూ.20లక్షలు ఇవ్వాలని ఆమె డిమాండ్‌ చేశారు. దాడికి పాల్పడిన నిందితునిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. సమాజంలో మహిళలు, చిన్నారులు స్వేచ్ఛగా తిరగాలంటే మద్యపానాన్ని నిషేధించాలని ప్రభుత్వాన్ని కోరారు. కార్యక్రమంలో ఆవాజ్‌ మండల ఉపాధ్యక్షులు రహంతుల్లా, కార్యదర్శి గౌష్‌బాషా, ఐద్వా నాయకులు రమాదేవి, మున్నీ, తదితరులు పాల్గొన్నారు.