Dec 20,2022 19:56

కరీముల్లాను సన్మానిస్తున్న కౌన్సిలర్‌ షబానా

ప్రజాశక్తి-మదనపల్లె అర్బన్‌: మహిళలకు విరివిగా పొదుపు రుణాలు ఇస్తున్నామని, సద్వినియోగం చేసుకోవడం ద్వారా అభివృద్ధి సాధ్యమవుతుందని జిల్లా వక్ఫ్‌ బోర్డు చైర్మన్‌ ఎస్‌.ఎ.కరీముల్లా అన్నారు. స్థానిక 14వ వార్డులోని మహిళా సంఘాలతో సమావేశం నిర్వహించారు. కరీముల్లా బాధ్యతలు చేపట్టడంపై మహిళా సంఘాలు, వార్డు కౌన్సిలర్‌ షేక్‌ షబానాతో కలసి సన్మానం చేశారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ మహిళ అభివృద్ధి చెందడం ద్వారానే కుటుంబం, సమాజం అభివృద్ధి చెందుతుందని తెలిపారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు ప్రతి ఒక్క మహిళా సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో మహిళా గ్రూప్‌ సభ్యులు, సచివాలయం సిబ్బంది పాల్గొన్నారు.