Jul 31,2022 22:41

ప్రజాశక్తి - తిరువూరు
అన్నిరంగాల్లో అగ్రభాగాన ఉన్న మహి ళలకు రక్షణ లేకుండా పోతుందని అఖి ల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా) ఎన్టీఆర్‌ జిల్లా కార్యదర్శి శ్రీదేవి ఆవేదన వ్యక్తంచేశారు. ఐద్వా తిరువూరు పట్టణ మూడవ మహాసభ స్థాని క సుందరయ్య విజ్ఞానకేంద్రంలో ఎం. నాగమణి అధ్యక్షతన జరిగింది. ము ఖ్యఅతిథిగా హాజరైన శ్రీదేవి మాట్లా డుతూ మహిళలకు ప్రతి రంగంలో 33 శాతం రిజర్వేషన్‌ కల్పించాలని ఐద్వా డిమాండ్‌ చేస్తుందన్నారు. రాజకీయ రంగంలో మహిళలు పాత్ర నామమా త్రంగా ఉందన్నారు. స్వాతంత్య్రం వచ్చిన దగ్గర నుండి దేశాన్ని పాలిస్తున్న బూర్జువా పార్టీలు మహిళలను రాజ కీయాల్లోకి రానివ్వకుండా 33 శాతం రిజర్వేషన్‌ అమలుచేయటం లేదని చెప్పారు. మహిళలపై జరుగుతున్న దాడులు, హత్యాచారాలు అరికట్టడం లో పాలకులు విఫలమవుతున్నారని, దీనిపై చట్ట సభల్లో మాట్లాడేందుకు మహిళా ఎంపిలు అధికంగా లేకుండా పోయారని ఆవేదన వ్యక్తంచేశారు. ఫలితంగా పోరాడి సాధించుకున్న మహిళా హక్కులు, చట్టాలను ప్రభుత్వం దుర్వినియోగం చేస్తుందని శ్రీదేవి ఆరోపించారు. మహిళా సాధికా రత సాధించాలంటే పుట్టిన ప్రతి అడ బిడ్డను చదివించాలని పేర్కొన్నారు. రాష్ట్రంలో జగన్‌ ప్రభుత్వ పేద, మధ్య తరగతి పిల్లలను చదువుకు దూరం చేసేందుకు చదివే పాఠశాలలను దూరంగా ఉన్న పాఠశాలలో విలీనం చేస్తుందని మండిపడ్డారు. ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా మహిళలు పెద్దఎత్తున ఉద్యమించాలని శ్రీదేవి పిలుపునిచ్చారు. ఈమహాసభలో ఐద్వా జిల్లా అధ్యక్షులు ఎస్‌.కుమారి, ఆళ్లా ఉమాదేవి పాల్గొన్నారు.