మహిళలకు అన్ని రంగాల్లో ప్రాధాన్యత
ప్రజాశక్తి-బిట్రగుంట : సిఎం జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వంలో మహిళలకు అన్ని రంగాల్లో ప్రాధాన్యత కల్పిస్తున్నారని ఎంఎల్‌ఎ రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి పేర్కొన్నారు. తాళ్లూరులో గ్రామంలో ఆదివారం గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో గడప గడపకు తిరిగి ప్రభుత్వ పథకాల కరపత్రాలను పంచి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వంలో మహిళలకు, రైతులకు, పేదవారికి అన్ని విధాల సహాయ సహకారాలను అందించిన ఏకైక ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని, పార్టీలకు అతీతంగా ప్రతి ఇంటికి ప్రభుత్వ పథకాలు చేరే విధంగా సచివాలయ వాలంటరీ వ్యవస్థను తీసుకువచ్చి ప్రతి సమస్యను సచివాలయ సిబ్బందితో పనులు పూర్తి చేసేలా ప్రభుత్వం పని చేస్తుందన్నారు. కార్యక్రమంలో గ్రామసర్పంచ్, వైసిపి మండల కన్వీనర్ మద్దిబోయిన వీరరఘు, ఎంపిటిసి ఎకె సుందర్‌రాజు, మద్దిబోయిన శేఖర్, కంటేపల్లి క్రిష్టయ్య, అన్ని శాఖల అధికారులు, గ్రామస్తులు పాల్గొన్నారు.










