Mar 25,2023 20:54

చెక్కు అందజేస్తున్న మంత్రి కాకాణి

చెక్కు అందజేస్తున్న మంత్రి కాకాణి
మహిళలకు అండగా వైసిపి ప్రభుత్వం
నెల్లూరు:రాష్ట్రంలోని మహిళలకు అండగా నిలుస్తూ, వారు ఆర్ధిక స్వాలంబన సాధించేలా రాష్ట్ర ప్రభుత్వం కషి చేస్తున్నదని రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్‌, ఫుడ్‌ ప్రాసెసింగ్‌ శాఖామాత్యులు కాకాణి గోవర్ధన్‌ రెడ్డి పేర్కొన్నారు. శనివారం వైయస్‌ఆర్‌ ఆసరా మూడవ విడత రాష్ట్ర వ్యాప్తంగా 7.98 లక్షల మహిళా సంఘాలలోని 78.94 లక్షల అక్క చెల్లెమ్మలకు లబ్ది చేకూరేలా 6,419.89 కోట్ల రూపాయలు నేరుగా మహిళా సంఘాల పొదుపు ఖాతాలలో జమచేసే కార్యక్రమాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి వై. ఎస్‌. జగన్‌ మోహన్‌ రెడ్డి ఏలూరు జిల్లా, దెందులూరు నుండి బటన్‌ నొక్కి జమ చేశారు.అందులో భాగంగా నగరంలోని శ్రీ వెంకటేశ్వర కస్తూరిభా కళాక్షేత్రంలో ఏర్పాటుచేసిన వైయస్సార్‌ ఆసరా మూడో విడత లబ్ధి పంపిణీ కార్యక్రమాన్ని మంత్రి కాకాణి గోవర్ధన్‌ రెడ్డి, జిల్లా పరిషత్‌ చైర్‌ పర్సన్‌ ఆనం అరుణమ్మ, శాసన మండలి సభ్యులు చంద్రశేఖర్‌ రెడ్డి లతో కలసి జ్యోతి ప్రజ్వలన గావించి ప్రారంభించారు.
ఈ సంధర్భంగా మంత్రి మాట్లాడుతూ, రాష్ట్రంలోని మహిళలకు అండగా నిలుస్తూ, వారు ఆర్ధిక స్వాలంబన సాధించేలా రాష్ట్ర ప్రభుత్వం కషి చేస్తున్నదన్నారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి తన పాద యాత్ర సమయంలో స్వయం సహాయక సంఘాలలో ఉన్న మహిళల ఆర్థిక ఇబ్బందులను కళ్ళారా చూసి, చలించి, తన ప్రభుత్వం వచ్చిన తక్షణమే అక్క చెల్లెమ్మలకు ఉన్న పొదుపు సంఘాల బ్యాంకు ఋణాల మొత్తాన్ని 4 విడతల్లో పొదుపు సంఘాల ఖాతాల ద్వారా నేరుగా అందిస్తానని హామీ ఇచ్చారన్నారు. ఇచ్చిన మాటకు కట్టుబడి ఇప్పటికే రెండు విడతలుగా చెల్లించడం జరిగిందన్నారు. మూడో విడత నిధుల పంపిణీకి శ్రీకారం చుట్టారన్నారు. ఈ పథకం వల్ల మహిళా సాధికారత మరింత మెరుగుపడి, పేద మహిళల యొక్క ఆర్ధిక పురోగతికి దోహదపడుతుందన్నారు. వై.ఎస్‌.ఆర్‌ ఆసరా పధకం కింద రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే 2 విడతల్లో 12,758 కోట్ల రూపాయల ఆర్ధిక సహాయాన్ని అందజేయగా మూడవ విడత కింద రాష్ట్ర వ్యాప్తంగా 7.98 లక్షల మహిళా సంఘాలలోని 78.94 లక్షల అక్క చెల్లెమ్మలకు లబ్ది చేకూరేలా 6,419.89 కోట్ల రూపాయలు నేరుగా మహిళా సంఘాల పొదుపు ఖాతాలలో జమచేస్తున్నట్లు తెలిపారు. జిల్లాకు సంబంధించి తొలి విడత 2020-21 సంవత్సరంలో 31,569 సంఘాల లోని 3,09,877 మందికి 250.23 కోట్ల రూపాయలను జమ చేశామని, 2వ విడతలో 2021-22 సంవత్సరంలో 34,323 సంఘాల లోని 3,28,646 మందికి 285.18 కోట్ల రూపాయలను వారి బ్యాంకు ఖాతాల్లో జమచేశామన్నారు. 3వ విడతలో 34,443 సంఘాల లోని 3,29,815 మందికి 290.17 కోట్ల రూపాయలను జమ చేస్తున్నట్లు పేర్కొన్నారు. అమ్మఒడి, విద్యాదీవెన, వసతిదీవెన, ఆసరా, చేయూతతో పాటు గహాలను కూడా మహిళల పేరునే మంజూరు చేస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. ఆహార భద్రతతో పాటు ఆరోగ్య భద్రత కల్పించాలన్న లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం చిరు ధాన్యాల వినియోగాన్ని పెంచేలా ప్రోత్సహిస్తున్నట్లు మంత్రి తెలిపారు. జిల్లా పరిషత్‌ చైర్‌ పర్సన్‌ ఆనం అరుణమ్మ ,శాసన మండలి సభ్యులు పర్వతరెడ్డి చంద్రశేఖర్‌ రెడ్డి పాల్గొని ప్రసంగించారు. జిల్లా గ్రామీణాబివద్ది సంస్థ ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌ సాంబశివా రెడ్డి జిల్లాలో వై.ఎస్‌.ఆర్‌ ఆసరా పధకం ఉద్దేశ్యాన్ని, మూడు విడతల్లో స్వయం సహాయక సంఘాల సభ్యులకు అందచేసిన ఆర్ధిక సహాయం వివరాలను తెలియజేశారు. అనంతరం ముఖ్యమంత్రి సందేశం కరపత్రాన్ని, స్టిక్కర్‌ ను మంత్రి ఆవిష్కరించారు.అనంతరం 3వ విడత ఆసరా పధకం క్రింద జిల్లా గ్రామీణాబివద్ది సంస్థ ద్వారా 2,67,736 మంది స్వయం సహాయక సంఘాల సభ్యులకు 237.96 కోట్ల రూపాయల మెగా చెక్కును, మెప్మా ద్వారా 60,533 స్వయం సహాయక సభ్యులకు 52.41 కోట్ల రూపాయల మెగాచెక్కును లబ్ధిదారులకు అందచేశారు. తొలుత రాష్ట్ర వ్యవసాయ సహకార మార్కెటింగ్‌ ఫుడ్‌ ప్రాసెసింగ్‌ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్‌ రెడ్డి చిరుధాన్యాల మహౌత్సవ కార్యక్రమంలో భాగంగా వివిధ ప్రభుత్వ శాఖలు ఏర్పాటుచేసిన ప్రదర్శనశాలలను సందర్శించి పిండివంటలను రుచి చూశారు. ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ రోణంకి కూర్మనాద్‌, బొందిలి కార్పొరేషన్‌ చైర్మన్‌ కష్ణ కిశోర్‌, కార్పొరేటర్‌ గౌరి, ఐటిడిఎ పిఓ మందా రాణి, మెప్మా, ఎపిఎంఐపి పి.డి లు రవీంద్ర , శ్రీనివాసులు, డి.టి.సి చందర్‌, సోషల్‌ వెల్ఫేర్‌ డిడి వెంకటయ్య, స్వయం సహాయక సంఘాల సభ్యులు తదితరులు పాల్గొన్నారు.