Sep 02,2022 22:58

ప్రజాశక్తి - ఇబ్రహీంపట్నం
అఖిలభారత ప్రజాతంత్ర మహిళా సంఘం-ఐద్వా కొండపల్లి ప్రధమ మహాసభ కొండపల్లి యలమంచల వెంకటేశ్వరరావు, కమలమ్మ దంపతుల ఐద్వా టౌన్‌ ఆఫీసులో కామ్రేడ్‌ లింగాల పార్వతి అధ్యక్షతన శుక్రవారం జరిగింది. ఈ సభలో పాల్గొన్న ఐద్వా ఎన్టీఆర్‌ జిల్లా కార్యదర్శి కె. శ్రీదేవి మాట్లాడుతూ మహిళా హక్కుల కోసం దేశవ్యాప్తంగా ఐద్వా పోరాడుతుందని, మహిళలు స్వయం శక్తితో ఎదగాలని అన్నారు. మహిళల అభ్యున్నతికి మహిళా చట్టాలను సక్రమంగా అమలు చేయాలని, మహిళల అక్షరాస్యత శాతం పెంచాలని, మహిళలకు ఉన్న 33% రిజర్వేషన్లు అమలు చేయాలని, మహిళా స్వేచ్ఛకు ప్రభుత్వాలు కషి చేయాలని పిలుపునిచ్చారు. ఆడపిల్లను బతకనిద్దాం... జీవించనిద్దాం అంటూ జిల్లాలో అనేక చైతన్యవంతమైన కార్యక్రమాలు నిర్వహించామని, కరోనా టైంలో నిరుపేద మహిళలకు సేవా కార్యక్రమాల ద్వారా చైతన్యం పరిచి సేవా సహాయ కార్యక్రమాలు చేశామన్నారు. మహిళలపై పెరుగుతున్న హింస, హత్యలు, పరువు హత్యలు సినిమాలు సీరియల్స్‌ లో మహిళలు చిత్రిస్తున్న ధోరణి, కులం,పేరుతో మహిళలపై పెరుగుతున్న దాడులను నిరసిస్తూ ఐద్వా అలుపెరగని పోరాటాలు చేసిందని తెలిపారు. కొండపల్లి పట్టణ కమిటీ ఆధ్వర్యంలో ఐద్వా చేసిన అనేక కార్యక్రమాల గురించి మహాసభలో చర్చించారు నూతన కమిటీని ఏర్పాటు చేశారు. సెప్టెంబర్‌ 14,15 న ఎన్‌టిఆర్‌ జిల్లా 20వ మహాసభలు కొండపల్లి ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో జరుగుతున్న సందర్భంగా జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.ఈ సందర్భంగా కొండపల్లి ఐద్వా పట్టణ కమిటీలో ఏర్పాటులో భాగంగా బి రామసీత గౌరవ అధ్యక్షురాలుగా, కానుకుర్తి బేబీ సరోజినీ అధ్యక్షురాలుగా, లింగాల పార్వతి కార్యదర్శిగా, చెన్నూరి వెంకట స్వరూప ఉపాధ్యక్షులుగా, కొంచెం రాజేశ్వరి ఉపాధ్యక్షులుగా, సామల వెంకట్‌ రావమ్మ సహాయ కార్యదర్శిగా, పొట్లూరి నవీన కోశాధికారిగా, కమిటీ సభ్యులుగా సత్య గౌరీ, జ్యోతిర్మయి, ఎన్‌ కరుణమ్మ, ఇర్ల దుర్గ, రాణి, కే రమణమ్మను నియమిస్తూ నూతన కమిటీ 13 మందితో ఏకగ్రీవ ఎన్నిక చేశారు.