Oct 15,2022 22:59

ప్రజాశక్తి - హెల్త్‌ యూనివర్శిటీ 

చిన్నారులు కిషోరబాలలు గర్భిణీలు బాలింతల ఆరోగ్య ప్రమాణాలను పెంచేందుకు జిల్లాలోని 1475 అంగన్‌వాడీ కేంద్రా ద్వారా 49 వేల మంది చిన్నారులకు అంగన్‌వాడీ కేంద్రాలలో వైఎస్సార్‌ సంపూర్ణ పోషణ బాలామృతం ద్వారా పౌష్టికాహారం అందజేస్తున్నట్లు జిల్లా కలెక్టర్‌ ఎస్‌ డిల్లీరావు తెలిపారు. అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా అందిస్తూ పౌష్టికాహారాన్ని పరిశీలిం చేందుకు శనివారం జిల్లా కలెక్టర్‌ ఎస్‌ డిల్లీరావు గుణదల మాచవరం పోలీస్‌ స్టేషన్‌ సమీపంలో అంగన్‌వాడీ కేంద్రాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా బాలింతలు, గర్భిణీలతో కలిసి కలెక్టర్‌ సహపంక్తి భోజనం చేసి చిన్నారులతో ముచ్చటించారు. అనంతరం జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ మహిళ గర్భం దాల్చిన నాటి నుండి శిశువుకు జన్మనించ్చేంతవరకు 36 వారాలు పాటు అవసరమైన వైద్య పరీక్షలు నిర్వహించి సంపూర్ణ పౌష్టికాహారాన్ని అంగన్‌వాడీ కేంద్రా ద్వారా అందజేస్తున్నట్లు ఆయన తెలిపారు. వైఎస్‌ఆర్‌ సంపూర్ణ పోషణ ద్వారా అంగన్‌వాడీ కేంద్రాలలోనే అనుభవం కలిగిన ఆయాల ద్వారా వంటను తయారు చేసి అన్నంతో పాటు పౌష్టిక విలువలు కలిగిన పప్పు, ఆకుకూర, గుడ్డు, పాలును పెట్టడం జరుగుతుందన్నారు. అంగన్‌వాడీ కేంద్రాలలో తినేందుకు వీలు లేని వారికి పాకెట్ల రూపంలో సరఫరా చేసే అవకాశం కల్పించామన్నారు. అంగన్‌వాడీ కేంద్ర సందర్శనలో కలెక్టర్‌ వెంట ఐసిడిఎస్‌ పిడి జి. ఉమాదేవి, సిడిపివోలు జి. మంగమ్మ కె. నాగమణి, అంగన్‌వాడీ సూపర్‌వైజర్‌ ఎస్‌కె రహేనా బేగం, శిశు సంక్షేమ శాఖ, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.