కదిరి అర్బన్ : మహిళాభివృద్ధే ధ్యేయంగా వైసిపి ప్రభుత్వం పనిచేస్తోందని స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ పివి. సిద్ధారెడ్డి పేర్కొన్నారు. స్థానిక మున్సిపాలిటీ మైనార్టీ ఫంక్షన్ హాల్ నందు కదిరి మున్సిపాలిటీ స్వయం సహాయక సంఘాల సభ్యులు నిర్వహించిన వైఎసార్ ్ ఆసరా సంబరాలలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మున్సిపాలిటీలో గల మొత్తం 953 స్వయం సహాయ సంఘాలకు రూ.5.91 కోట్ల రూపాయలను వారి ఖాతాలో జమచేశామన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్లు, కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు, వివిధ శాఖల చైర్మన్లు, డైరెక్టర్లు తదితరులు పాల్గొన్నారు.
పెనుకొండ : రాష్ట్రంలో మహిళల ఆర్థిక అభివృద్దే ధ్యేయంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కృషి చేస్తున్నారని స్థానిక ఎమ్మెల్యే, వైసిపి జిల్లా అధ్యక్షులు శంకర్ నారాయణ పేర్కొన్నారు.సోమవారం పట్టణంలోని వన్సిక ఫంక్షన్ హాల్ లో వైఎస్‌ఆర్ ఆసరా మూడవ విడత సంబరాలను ఎమ్మెల్యే ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీ సానిపల్లి మంగమ్మ, జడ్పీ ఛైర్‌పర్సన్ బోయ గిరిజమ్మ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నెరవేరుస్తోందన్నారు. అనంతరం సీఎం జగన్ మోహన్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల కన్వీనర్ నాగలూరు బాబు, టౌన్ కన్వీనర్ బోయ నరసింహ, నగర పంచాయతీ ఛైర్మన్ ఫరూక్, వైస్ ఛైర్మన్ ్ సునీల్, జయ శంకర్ రెడ్డి, కౌన్సిలర్లు, వైసిపి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.










