Jan 03,2023 21:27

సన్మానం చేస్తున్న దృశ్యం

సన్మానం చేస్తున్న దృశ్యం
మహిళా ఉపాధ్యాయునిలకు ఘనంగా సన్మానం
నెల్లూరు :కొండాయపాళెం లోని నగర పాలక ప్రాథమిక పాఠశాల లో సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయుడు యం భాస్కర్‌ రావు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నెహ్రూ యువ కేంద్ర డిస్ట్రిక్ట్‌ యూత్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ ఆకుల మహేందర్‌ రెడ్డి విచ్చేసి సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పుష్పాంజలి అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ భారతీయ సంఘ సంస్కర్త, ఉపాధ్యాయిని, రచయిత్రి. ఆమె నిమ్న వర్గాల అభ్యున్నతికి కషి చేసిన జ్యోతీరావ్‌ ఫూలే భార్య. కులమత భేదాలకు అతీతంగా సమాజాన్ని ప్రేమించిన ప్రేమస్వరూపిణి. ఆధునిక విద్య ద్వారానే స్త్రీ విముక్తి సాధ్యపడుతుందని నమ్మిన ఆమె, తన భర్తతో కలసి 1848 జనవరి 1న పూణేలో మొట్టమొదటగా బాలికల పాఠశాలను ప్రారంభించిందన్నారు.
కుల వ్యవస్థకు, పితస్వామ్యానికి వ్యతిరేకంగా, శూద్రుల, అస్పశ్యుల, మహిళల సకల హక్కుల కోసం పోరాటం చేయటం తమ సామాజిక బాధ్యతగా ఆ దంపతులు విశ్వసించారు. నూతన వ్యవస్థ కోసం, ప్రాణాల్ని సైతం పణంగా పెట్టి సమష్టిగా పోరాటం చేసిందని తెలిపారు అనంతరం మహిళా ఉపాధ్యాయునిలు సంధ్యారాణి, మాధవి, వినీత , రాశి లను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు హరీష్‌ విద్యార్థులు పాల్గొన్నారు.