కలెక్టర్‌ను సన్మానిస్తున్న మహిళా ఉద్యోగులు
మహిళా ఉద్యోగులకు క్రీడాపోటీలు
నెల్లూరు:మార్చి 8 వ తేదీన అంతర్జాతీయ మహిళా దినోత్సవం ను పురస్కరించుకుని నెల్లూరు దర్గామిట్టలోని ఏపీ యన్ జీ ఓస్ అసోసియేషన్ భవనం ఆవరణంలో మహిళా ఉద్యోగులకు క్రీడా పోటీలు నిర్వహిస్తున్నట్లు ఏపి ఎన్‌జిఓ అధ్యక్ష, కార్యదర్శులు ఎం.పెంచలరావు, నాయుడు వెంకటస్వామిలు తెలిపారు. సోమవారం ఎన్‌జిఓ సంఘం నాయకులు పలువురు కలెక్టర్ కె.వి.ఎన్ చక్రధర్‌బాబును కలిసి మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని నిర్వహిస్తున్న మహిళా క్రీడా పోటీలకు ముఖ్యఅతిధిగా హాజరు కావాలని కోరారు.ఈ క్రీడా పోటీలకు ముఖ్యఅతిధులుగా కలెక్టర్ హాజరౌతున్న నేపథ్యంలో మహిళా ఉద్యోగుల ఆటల పోటీలకు కలెక్టర్ హాజరు కానున్న నేపథ్యంలో జిల్లా , నగరంలో ప్రభుత్వ రంగాలకు చెందిన మహిళా ఉద్యోగులందరూ అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని పిలుపు నిచ్చారు. ముఖ్యంగా ఏపీ యన్ జీ ఓస్ అసోసియేషన్ జిల్లా కార్యవర్గ సభ్యులు అన్ని తాలూకాల అధ్యక్ష కార్యదర్శులు, కార్యవర్గ సభ్యులు పూర్తి సహకారం అందిచాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఏపీ యన్ జీ ఓస్ అధ్యక్ష కార్యదర్శులు మన్నేపల్లి. పెంచలరావు, నాయుడు. వెంకటస్వామి,అసోసియేట్ అధ్యక్షులు నందిమండలం. ఆంజనేయ వర్మ,రాష్ట్ర మహిళా విభాగం వైస్ చైర్ పర్సన్ కె.స్వర్ణలత, జిల్లా చైర్ పర్సన్ యు.చిన్నమ్మ, జిల్లా ఉపాధ్యక్షురాలు ఈ.కరుణమ్మ,జిల్లా మహిళా కన్వీనర్ ఏ వీ యస్ శారద నగర అధ్యక్ష కార్యదర్శులు చిలకా.రామకష్ణారెడ్డి, డేగల. మార్కండేయులు,కోశాధికారి సురేష్, సంయుక్త కార్యదర్శి షేక్. షంషుద్దీన్ తదితరులు పాల్గొన్నారు.










