కడప అర్బన్ : ప్రభుత్వం మహిళా పక్షపాతిగా అన్ని సంక్షేమ పథకాలను మహిళలకు అందించడం జరుగుతోందని, తద్వారా రాష్ట్రంలో మహిళాభివద్ధి ఈ ప్రభుత్వం ద్వారానే సాధ్యమవుతుందని ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా పేర్కొన్నారు. బుధవారం నగరపాలక సంస్థ, మెప్మా ఆధ్వర్యంలో 3వ విడత వైయస్సార్ ఆసరాలి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పొదుపు సంఘాల ఖాతాలలో 9,290 మంది లబ్ధిదారులకు రూ.7.71 కోట్లు జమ చేస్తున్నారని పేర్కొన్నారు. నగరానికి సంబంధించి సంవత్సరానికి రూ.33 కోట్లు అందించామన్నారు. అనంతరం కార్పొరేటర్లు అక్బర్ అలీ, షేక్ మహమ్మద్ షఫీ, అజమతుల్లా ఖాన్, బసవ రాజు, చెన్నయ్య, జహీర్, కమల్ బాషా, ఆరీఫుల్లా, నాయకులు నరపురెడ్డి సుబ్బారెడ్డి, నాయకురాళ్ళు టి.వి.సుబ్బమ్మ, పత్తి రాజేశ్వరి ప్రసంగించారు. మెగా చెక్కను మహిళాల బ్ధిదారులకు అందచేశారు. కార్యక్రమంలో మార్కెట్ యార్డు వైస్ ఛైర్మన్ ఇబ్రహీం మియా, వైసిపి నాయకులు ఎన్‌ఆర్‌ఐ తోట కృష్ణ, సుబాన్‌బాషా, ఇతర కార్పొరేటర్లు, సిఎంఎం హరిప్రసాద్‌రెడ్డి పాల్గొన్నారు.
వల్లూరు : మహిళల ఆర్థిక అభివద్ధి లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తుందని ఎమ్మెల్యే రవీంద్రనాథ్‌రెడ్డి, ఆర్‌టిసి చైర్మన్ మల్లికార్జునరెడ్డి అన్నారు. గంగాయపల్లి ఆదర్శ పాఠశాలలో మూడవ విడత ఆసరా పథకం కింద మండల పరిధిలో 560 సంఘాలకు సంబంధించి 2,343 మంది మహిళలకు రూ.5 కోట్లు మంజూరైన చెక్‌ను అందజేశారు. కార్యక్రమంలో జడ్‌పిటిసి వెంకటసుబ్బయ్య, మండల కన్వీనర్ అబ్బిరెడ్డి వీరారెడ్డి, వల్లూరు సర్పంచ్ తాడిగొట్ల శ్రీనివాసులురెడ్డి, స్టేట్ యూత్ జనరల్ సెక్రెటరీ ఇందిరెడ్డి శంకర్‌రెడ్డి, మాజీ ఎంపిపి శివకుమార్ రెడ్డి, వైస్ ప్రెసిడెంట్ గంగయ్య, తహశీల్దార్ అమరేశ్వరి, ఇఒపిఆర్‌డి ప్రసాద్, ఎపిఎం శైలజా దేవి, స్వయం సహాయక సంఘాల మహిళలు పాల్గొన్నారు.










