Apr 18,2023 20:35

వైఎస్‌ఆర్‌ ఆసరా చెక్కును పంపిణీ చేస్తున్న ఎమ్మెల్యే

 కురబలకోట : మహిళా సాధికారతే ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి లక్ష్యమని ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకానాథ్‌రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం అంగళ్లు సమీపంలో ఉన్న కెఎంఆర్‌ కల్యాణ మండపంలో నిర్వహించిన ఆసరా చెక్కులు పంపిణీ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ప్రగతిపథంలో డ్వాక్రా సంఘాలు ప్రభుత్వం చేపట్టిన చర్యలు, పథకాల అమలు కారణంగా పొదుపు సంఘాల ఆర్థికవద్ధి పెరిగిందన్నారు. గత ప్రభుత్వ పాలనలో నిర్వీర్య దశలో ఉన్న పొదుపు సంఘాలకు ప్రభుత్వం ఇస్తున్న ప్రోత్సాహకాలు జీవం పోశాయని అన్నారు. గత ప్రభుత్వ హయాంలో 18 శాతం సంఘాలు ఒవర్‌ డ్యూస్‌గా ఉంటే మన ప్రభుత్వంలో 0.45 శాతానికి తగ్గాయన్నాని చెప్పారు. మహిళలకు పదవుల్లో 50శాతం రిజర్వేషన్లు, మహిళల రక్షణకు దిశ యాప్‌, మహిళల పేరుతో ఇళ్లస్థలాలు, పక్కాగహాలు మంజూరు, పేదరిక నిర్మూలనకు ఆసరా, చేయూత, సున్నావడ్డీ పథకాల అమలుతో మహిళలకు మంచి జరుగుతోందన్నారు. కార్యక్రమంలో జడ్‌పిటిసి చంద్రశేఖర్‌రెడ్డి, ఎంపిడిఒ దిలీప్‌, ఎంపిపి దస్తగిరి, మార్కెట్‌ కమిటీ ఛైర్మెన్‌ డి.ఆర్‌ ఉమాపతిరెడ్డి, విశ్వనాథ్‌రెడ్డి, ఆర్‌కె.కష్ణారెడ్డి, ఆర్‌బికె చైర్మన్‌ శివశంకర్‌ రెడ్డి, కులదీప్‌రెడ్డి, సచివాలయ సిబ్బంది మల్లికార్జున,చంద్ర కళ, ఎంపిఎం నీరజ ,వెలుగు సిబ్బంది పాల్గొన్నారు.