Apr 12,2023 21:13

మహిళలకు చెక్కు అందజేస్తున్న కలెక్టర్‌ గిరీష

రాయచోటి : మహిళా సాధికారతే లక్ష్యంగా ఇబిసి నేస్తం పథకం ద్వారా మహిళలు ఆర్థికంగా ఎదిగేందుకు ప్రభుత్వం చేయూత నందిస్తోందని కలెక్టర్‌ గిరీష తెలిపారు. బుధవారం ప్రకాశం జిల్లా మార్కాపురం నుంచి వైయస్సార్‌ ఇబిసి నేస్తం పథకం కింద 45-60 సంవత్సరాల మధ్య వయసు ఉన్న అర్హులైన అగ్రవర్ణాలకు చెందిన అక్క చెల్లెమ్మలకు రెండవ విడత ఆర్థిక సాయాన్ని బటన్‌ నొక్కి నేరుగా వారి ఖాతాల్లో జమ చేసే కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి ప్రారంభించారు. కలెక్టరేట్లోని స్పందన హాల్లో వైయస్సార్‌ ఇబిసి నేస్తం పథకం ఆర్థిక సాయాన్ని ముఖ్యమంత్రి జమ చేసే వర్చువల్‌ కార్యక్రమాన్ని కలెక్టర్‌ గిరీష, డిఆర్‌ఒ సత్యనారాయణ, రాయచోటి మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ వి.వెంకటేశ్వర్లు, బిసి సంక్షేమ శాఖ అధికారి సందప్ప, మహిళలు హాజరై వీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ఆర్థికంగా వెనుకబడిన రెడ్డి, కమ్మ, ఆర్యవైశ్య, బ్రాహ్మణ, క్షత్రియ, వెలమలతోపాటు ఇతర ఒసి సామాజిక వర్గాలకు చెందిన అర్హులైన పేద మహిళలకు వైయస్సార్‌ ఇబిసి నేస్తం పథకం ద్వారా ప్రభుత్వం అండగా నిలుస్తోందన్నారు. ప్రభుత్వం ద్వారా ఆర్థిక సహాయం అందుకున్న మహిళలు సొంత వ్యాపారాలు లేదా జీవనోపాధి మార్గాలను ఎంచుకొని వారి కాళ్ళ మీద వారు నిలబడేట్టుగా. ఎదగాలన్నారు. ప్రతి మహిళ ముఖంలో చిరునవ్వు, వారి కుటుంబంలో సంతోషం వెల్లివిరిసేందుకు అమ్మ ఒడి, కాపునేస్తం, చేయూత, సున్నావడ్డీ, ఆసరా, వసతి దీవెన, విద్యాదీవెన, విద్యా కానుక, జగనన్న తోడు, గోరుముద్ద, వైఎస్‌ఆర్‌ సంపూర్ణ పోషణ, మహిళలకు ఇళ్ల పట్టాల పంపిణీ తదితర పథకాలను ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తోందన్నారు. మహిళల భద్రత కోసం దిశ యాప్‌, దిశ పోలీస్‌ స్టేషన్లు, గ్రామ వార్డు సచివాలయాలలో మహిళా పోలీసులను నియమించడం తో పాటు అనేక పథకాలను అమలు చేయడం జరిగిందన్నారు. మహిళలకు సాధికారత కల్పించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం క షి చేస్తోందని చెప్పారు. ప్రభుత్వ పథకాలను మహిళల సద్వినియోగపరచుకోవాలని పేర్కొన్నారు. కలెక్టర్‌, డిఆర్‌ఒ, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌, బిసి సంక్షేమ శాఖ అధికారి తదితరులు వైయస్సార్‌ ఇబిసి నేస్తం రెండవ విడత లబ్ధి రూ.37.06 కోట్ల మెగా చెక్కును అర్హులైన మహిళలకు అందజేశారు. కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, మార్కెట్‌ కమిటీ సభ్యులు, మహిళలు పాల్గొన్నారు.