ప్రశంసాపత్రం అందుకుంటున్న కండక్టర్
కదిరి టౌన్ : ఉత్తమ విధులు నిర్వహించిన కదిరి డిపోలో మహిళా కండక్టర్ లక్ష్మీనరసమ్మను సన్మానించారు. 2022 సంవత్సరములో అత్యున్నత ప్రతిభతో తెలుగు వెలుగు బస్సులలో అత్యధిక ఆదాయం తెచ్చినందున అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గోపినాథ్ రెడ్డి తదితరులు లక్ష్మీ నరసమ్మను సన్మానించి ప్రోత్సాహకంగా 500 రూపాయల నగదు అవార్డు, ప్రశంసా పత్రం అందజేసి సత్కరించారు. నేషనల్ మజ్దూర్ యూనిటీ అసోసియేషన్ నాయకులు హరి మోహన్, బైరిశెట్టి, ఎన్‌వి. రమణ, రామకృష్ణ, నారాయణస్వామి తదితరులు అభినందించారు. ఈ అవార్డు పంపిణీ కార్యక్రమంలో జోనల్ అధికారులు అజమతుల్లా, హరినాథ్ బాబు తదితరులు పాల్గొన్నారు.










