Jan 07,2023 18:51

మహీధర్‌రెడ్డికి స్వాగతం పలుకుతున్న బాబురావు, వెంకట సుబ్బయ్య

ప్రజాశక్తి - లింగసముద్రం  కొత్తమాలకొండ్రాయునిపాలెంలో ఉన్న సమస్యల పరిష్కరానికి చర్యలు చేపడతామని ఎంఎల్‌ఎ మానుగుంట మహీధర్‌రెడ్డి తెలిపారు. శనివారం ఆయన డిఆర్‌డిఎ పీడీ సాంబశివారెడ్డితో కలిసి గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమానికి వచ్చిన సందర్భంగా వైసిపి నాయకలు గుంటుపల్లి బాబురావు,చావా వెంకటసుబ్బయ్య,చావా నరసయ్య గ్రామం లోని దేవాలయం వద్ద మహీధర్‌రెడ్డికి బుకే ఇచ్చి ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వారు గ్రామంలో ఉన్న సమస్యలను మహీధర్‌రెడ్డి దృష్టికి తెచ్చారు.గ్రామంలో వాటర్‌ ఫ్లాంట్‌ ఏర్పాట్టు చేయాలని,గ్రామంలో ఉన్న ఎస్‌టిలకు ఇళ్లపట్టాలు ఇవ్వాలని కోరారు. అధికారులతో మాట్లాడి వెంటనే పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామన్నారు.