Sep 09,2022 22:36

ప్రజాశక్తి-కంచికచర్ల: కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సిఐటియు ఆధ్వర్యంలో ఈ నెల 13న విజయవాడ ధర్నా చౌక్‌ వద్ద జరిగే మహాధర్నాను జయప్రదం చేయాలని సిఐటియు జిల్లా నాయకులు ఎన్‌.నాగేశ్వరరావు కోరారు. శుక్రవారం ఆటో స్టాండ్ల వద్ద ఆటో కార్మికులకు కరపత్రాలు పంచుతూ విస్తృత ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ కార్మికులకు కనీస వేతనాలు అమలు చేయాలన్నారు. కనీస వేతనాల సలహా బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు. పెరుగుతున్న ధరలను అదుపు చేయటంతో పాటు, అసంఘటిత రంగ కార్మికుల సంక్షేమం కోసం సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి, సామాజిక భద్రత కల్పించాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో ఆటో కార్మికులు వరికూటి చినబాబు, పి రాజశేఖర్‌, వీరయ్య, యం పుల్లారావు, పౌల్‌ తదితరులు పాల్గొన్నారు.