May 16,2023 21:28

చెత్తను పరిశీలిస్తున్న కమిషనర్‌

చెత్తను పరిశీలిస్తున్న కమిషనర్‌
మెరుగైన పారిశుధ్య నిర్వహణకు సహకరించండి
- కమిషనర్‌ వికాస్‌ మర్మత్‌, ఐ.ఏ.ఎస్‌
నెల్లూరు:క్లీన్‌ ఆంధ్రప్రదేశ్‌ కార్యాచరణలో భాగంగా నగర పాలక సంస్థ ప్రణాళికాబద్ధంగా నిర్వహిస్తున్న డోర్‌ టు డోర్‌ చెత్త సేకరణలో తడి, పొడి చెత్తను విడివిడిగా అందించి మెరుగైన పారిశుద్ధ్య నిర్వహణకు సహకరించాలని కమిషనర్‌ కమిషనర్‌ వికాస్‌ మర్మత్‌ కోరారు. స్థానిక 39, 40 డివిజన్లు మూలాపేట, మెక్లెన్స్‌ రోడ్‌, పుట్టా లే అవుట్‌, సాయి నగర్‌ శానిటేషన్‌ మస్టర్‌ పాయింట్లను కమిషనర్‌ మంగళవారం ఉదయం 6.30 గంటలకు తనిఖీ చేశారు. డివిజన్ల పరిధిలోని వివిధ ప్రాంతాల్లో పర్యటించి శానిటేషన్‌ సిబ్బంది హాజరును కమిషనర్‌ పరిశీలించారు. పారిశుద్ధ్య నిర్వహణ పనుల పర్యవేక్షణలో భాగంగా డివిజనుల్లో జరుగుతున్న చెత్త సేకరణ పనులను కమిషనర్‌ పర్యవేక్షించారు. అనంతరం స్థానిక ప్రజలతో కమిషనర్‌ ప్రత్యక్షంగా మాట్లాడుతూ చెత్త సేకరణ యూజర్‌ చార్జీలను ప్రతిఒక్కరూ బాధ్యతగా చెల్లించాలని కోరారు. తడి, పొడి చెత్తను విడివిడిగా చెత్త సేకరణ వాహనాలకు అందించాలని సూచించారు
. చెత్త సేకరణ వాహనాలకు మాత్రమే గహ వ్యర్ధాలను అందించాలని, బహిరంగ ప్రదేశాల్లో చెత్తను వేస్తే జరిమానాలు విధిస్తామని, చెత్తను రీసైక్లింగ్‌ ప్రక్రియ ద్వారా సేంద్రీయ ఎరువులుగా మార్చి తిరిగి వినియోగంలోకి తీసుకురాగలమని కమిషనర్‌ ప్రజలకు వివరించారు. వాహనాలకు కాకుండా బహిరంగ ప్రదేశాల్లో, డ్రైను కాలువల్లో చెత్తను వేయడం వలన దోమల వ్యాప్తి పెరిగి అనారోగ్యాలు కలుగుతాయని కమిషనర్‌ పేర్కొన్నారు. బహిరంగ ప్రదేశాల్లో చెత్తను వేయరాదని అవగాహన కల్పిస్తూ సచివాలయాల పరిధిలోని ప్రతీ ఇంటికి నోటీసులు అందించాలని కార్యదర్శులను కమిషనర్‌ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో నగర పాలక సంస్థ ఆరోగ్య శాఖాధికారి డాక్టర్‌ వెంకట రమణ, సూపర్వైజర్లు, శానిటేషన్‌ ఇన్స్పెక్టర్‌ లు, సచివాలయం శానిటేషన్‌ కార్యదర్శులు పాల్గొన్నారు.