Dec 27,2022 22:29

విద్యార్థులకు భోజనం వడ్డిస్తున్న జెడ్పీ ఛైర్‌పర్సన్‌

కొత్తచెరువు : విద్యార్థులకు మెనూ ప్రకారమే నాణ్యమైన భోజనం అందించాలని జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ బోయ గిరిజమ్మ ఆదేశించారు. స్థానిక జిల్లా పరిషత్‌ బాలుర బాలికల పాఠశాలను ఆమె మంగళవారం తనిఖీ చేశారు. విద్యార్థులకు అందుతున్న భోజనం గురించి ఆరా తీశారు. మెనూ ప్రకారం భోజనం రుచికరంగా అందించాలని సూచించారు. ఉపాధ్యాయులు విద్యార్థులకు మెరుగైన విద్యను అందించాలన్నారు. పదవ తరగతి విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. నాడు నేడు కింద జరుగుతున్న మరమ్మతు పనులను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో హెచ్‌ఎంలు చెన్నకృష్ణారెడ్డి, సుమన, జెడ్పీటీసీ గంగాదేవి శంకర్‌, విద్యా కమిటీ చైర్మన్‌ గిరిబాబు, వైసిపి నాయకులు రామచంద్ర, ముద్దల భాస్కర్‌, సుబ్బారావు, వెంకటరాముడు తదితరులు పాల్గొన్నారు.