మదనపల్లె అర్బన్ :పట్టణంలోని బిటి పభుత్వ డిగ్రీ కళాశాలలో ఎంపీ మిథున్‌రెడ్డి ఆధ్వర్యంలో ఫిబ్రవరి 10న మెగాజాబేళాను నిర్వహించనున్నామని, నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని విజయవంతం చేయాలని ఎంఎల్‌ఎ నవాజ్‌బాషా, ఎపి స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ అజరురెడ్డి కోరారు. ఆదివారం స్థానిక మున్సిపల్ కార్యాలయంలో మెగా జాబ్‌మేళాకు సంబంధించి నియోజకవర్గ ప్రజాప్రతినిధులు, అధికారులు, సచివాలయ సిబ్బందితో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంఎల్‌ఎ మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాలమేరకు నియోజకవర్గంలో చదువుకున్న ప్రతి ఒక్కరికీ అర్హత ఆధారంగా ఉద్యోగాలు కల్పించేందుకు మెగాజాబేళా నిర్వహించనున్నామని చెప్పారు. నిరుద్యోగుల జీవితాల్లో వెలుగులు తీసుకువచ్చి వారి కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించాలనే సదుద్దేశంతో ఏర్పాటు చేయనున్నామని తెలిపారు. ప్రజాప్రతినిధులు, అధికారులు, సచివాలయ సిబ్బంది, వలంటీర్లు మెగాజాబ్ మేళాను బాధ్యతగా భావించాలన్నారు. ప్రతి ఇంటికీ వెళ్లి నిరుద్యోగుల వివరాలను సేకరించి జాబ్‌మేళాపై అవగాహన కల్పించాని చెప్పారు. చైర్మన్ మాట్లాడుతూ ఎంపీ పెద్దిరెడ్డిమిథున్‌రెడ్డి, ఎంఎల్‌ఎ నవాజ్‌బాషా నిర్వహించబోయే మెగాజాబేళాపై సచివాలయ సిబ్బంది, వాలంటీర్ల సాయంతో ఇంటింటికీ వెళ్లి విస్తత ప్రచారం కల్పించాలన్నారు. ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో ప్రతి నెలా ఒకటిన మెగాజాబేళా, మినీ జాబ్‌మేళా నిర్వహిస్తామని తెలిపారు. అనంతరం మెగాజాబేళాకు సంబంధించిన వాల్‌పోస్టర్లను ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఏపీఎండీసీ చైర్పర్సన్ షమీం అస్లాం, మున్సిపల్ చైర్ పర్సన్ మనూజ, జడ్పీటీసీ ఉదరు కుమార్, మునిసిపల్ వైస్ చైర్మన్ జింక వెంకటాచెలపతి, కమిషనర్ ప్రమీల పాల్గొన్నారు.










