మేయర్‌పై దాడి చేసిన వారిని అరెస్టు చేయాలి
ప్రజాశక్తి-అల్లూరు : నెల్లూరు నగర మేయర్ పోట్లూరు స్రవంతిపై దాడి చేసిన వారిని వెంటనే అరెస్టు చేయాలని జిల్లా యానాది మహిళా అధ్యక్షురాలు బాపట్ల సత్యవతమ్మ పేర్కొన్నారు. శుక్రవారం మండల కేంద్రం స్థానిక డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ విగ్రహం వద్ద దాడిని తీవ్రంగా ఖండిస్తూ నిరసన వ్యక్తపరిచారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గిరిజన మహిళపై దాడి చేయడం సిగ్గుచేటన్నారు. దళిత సంఘర్షణ సమితి జిల్లా అధ్యక్షులు ఎస్.మల్లి మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన నాటి నుండి ఎస్‌సి, ఎస్‌టి, బిసి మైనార్టీలపై దాడులు పెచ్చు మీరిపోయాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ జిల్లాలో మేకపాటి చంద్రశేఖర్ రెడ్డిపై, ఆనం రామనారాయణరెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిపై ఏనాడు దాడులు జరగవని కేవలం బలహీనవర్గాలపైనే నిత్యం దాడులు జరుపుతున్నారన్నారు. ముఖ్యమంత్రి ఒక కొత్త ఫార్ములాతో ఈ దాడులకు పాల్పడడం చాలా దుర్మార్గమన్నారు.










