మేడేను విజయవంతానికి పిలుపు
ప్రజాశక్తి-ఉదయగిరి : కార్మికుల పండగ మేడేను ఘనంగా నిర్వహించడానికి ప్రతి కార్మికుడు పాల్గొనాలని సిపిఎం, సిఐటియు, రైతు సంఘం నాయకులు పిలుపునిచ్చారు. ఆదివారం స్థానిక పుచ్చలపల్లి సుందరయ్య భవనంలో వారు మాట్లాడుతూ మండల ప్రజలకు అన్ని రంగాల కార్మికులకు నాయకులకు ముందుగా మేడే శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి కార్మికుడు మే ఒకటిన జరుపుకునే పండుగ లాంటి ఈ కార్యక్రమంలో మండలంలో అన్ని శాఖల యూనియన్ల తమతమ ప్రాంతాలలో జెండాలను ఎగరవేసి 10 గంటలకు ఉదయగిరి స్థానిక బస్టాండ్ సెంటర్‌కు చేరుకొని జెండాను ఎగరవేసేందుకు కలిసి రావాలన్నారు. కార్యక్రమానికి అధిక సంఖ్యలో కార్మికుల పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి ఫర్థీన్ బాషా, సిఐటియు నాయకులు గడ్డం నాగేశ్వరరావు, రైతు సంఘం నాయకులు కాకు వెంకటయ్య, మండల మహిళ ఐద్వా నాయకురాలు కామాక్షమ్మ పాల్గొన్నారు.










