Apr 30,2023 21:35

ఆటోప్రచారాన్ని ప్రారంభిస్తున్న దృశ్యం

ప్రజాశక్తి-వలేటివారిపాలెం : ప్రపంచ కార్మికదినోత్సవం మేడే సందర్భంగా సోమవారం సాయంత్రం నాలుగు గంటలకు వలేటివారిపాలెంలో జరిగే కార్మిక ప్రదర్శన, సభను జయప్రదం చేయాలని సిఐటియు నాయకులు కోరారు. ఆ సందర్భాన్ని పురస్కరించుకొని ఆటో ప్రచార కార్యక్రమాన్ని రైతుసంఘం జిల్లా నాయకులు మాదాల రమణయ్య ఆదివారం సాయంత్రం జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా నాయకులు జివిబి కుమార్‌ మాట్లాడారు. కార్మిక, కర్షక ఐక్యతను చాటే మేడే దినోత్సవాన్ని సిఐటియు, ప్రజాసంఘాల ఆధ్వర్యంలో వివిపాలెంలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సభకు కార్మికులు, రైతులతో పాటు ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల నాయకులు పాల్గొని ప్రసంగిస్తారన్నారు. సభకు అంగన్‌వాడీలు, ఆశ కార్యకర్తలు, భవన నిర్మాణ కార్మికులు, ఉపాధి కూలీలు, ఉపాధ్యాయులు, సచివాలయ ఉద్యోగులు, విఆర్‌ఎలు, ఫీల్డ్‌ అసిస్టెంట్లు హాజరై జయప్రదం చేయాలని కోరారు. ప్రచారంలో మండల కార్యదర్శి సాదు చెన్నకేశవులు, వ్యవసాయ కార్మికసంఘం జిల్లాకమిటి సభ్యులు దువ్వూరు జాన్‌, విఆర్‌bల సంఘం నాయకులు కామినేని నాగూర్‌, bస్‌ హరి, మాల్యాద్రి ఉన్నారు.