యోగా చేస్తున్న సిబ్బంది
మెడికవర్‌లో అంతర్జాతీయ యోగా దినోత్సవం
నెల్లూరు:నగరంలోని మెడికవర్ వైద్యశాలలో అంతర్జాతీయ యోగా దినోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. బుధవారం నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిధులుగా యోగా ట్రయినర్ సునోలా, వైద్యశాల డాక్టర్స్, సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా యోగా ట్రయినర్ సునోలా మాట్లాడుతూ యోగా అనేది కొన్ని వేల సంవత్సరాల నాటి భారతీయ ఆధ్యాత్మిక సాధనమన్నారు. మనస్సును, శరీరాన్ని ఏకం చేసి రెండింటి మధ్య సమన్వయం తీసుకురాగల ఒక అద్వితీయమైన అభ్యాసం యోగా అన్నారు. ఆరోగ్యకరమైన జీవనానికి సంబంధించిన కళ. ఇది వ్యాయామాలకు మించిన శక్తివంతమైన ప్రయోజనాలను అందిస్తుంది. అనంతరం డాక్టర్ గణేష్ నాగిరెడ్డి గారు సెంటర్ హెడ్ మాట్లాడుతూ యోగాను రోజువారీ జీవితంలో భాగం చేసుకోవడం వల్ల దీర్ఘకాలంలో అనేక ప్రయోజనాలు లభిస్తాయి. మధుమేహం, ఊబకాయాన్ని అరికట్టడంలో యోగా అద్భుతంగా పనికొస్తుందని, గుండె జబ్బులు, కాలేయ సమస్యల నియంత్రణ కూడా యోగాతో సాధ్యమేనని పరిశోధనలు వెల్లడిస్తున్నాయి . రోజూ యోగా చేస్తే మన పంచేంద్రియాలు, శరీరం లోని జీర్ణ వ్యవస్థ, రక్త సరఫరా వ్యవస్థ, విసర్జిక వ్యవస్థ, శ్వాసకోశ వ్యవస్థ, పునరుత్పత్తి వ్యవస్థ, నాడీ వ్యవస్థ, వినాళ గ్రంథి వ్యవస్థ వంటి అన్ని వ్యవస్థలూ స్పందించి ఆయా అవయవాలు సక్రమ స్థితిలో ఉంటాయి.అనంతరం ఉదరు భాస్కర్ మార్కెటింగ్ రీజనల్ మేనేజర్ మాట్లాడుతూ నేడు ప్రపంచంలో ఎక్కువ మంది మధుమేహంతో బాధపడుతున్నారు. ఇది ఆహారాన్ని శక్తిగా మార్చే ప్రక్రియను ప్రభావితం చేసే దీర్ఘకాలిక అనారోగ్యం. సాధారణంగా మనం తినే ఆహారం గ్లూకోజ్‌గా విడిపోయి రక్తప్రవాహంలో విడుదలవుతుంది. ఇది మనం రోజువారీగా అనేక పనులను చేయడానికి శరీరానికి అవసరమైన శక్తిని అందిస్తుందన్నారు. యోగా వల్ల వ్యాధి నిరోధక శక్తి బాగా పెరుగుతుంది, రక్తపోటు, మధుమేహ మందుల డోసును గణనీయంగా తగ్గిస్తుంది. కాబట్టి ప్రతి వ్యక్తీ రోజూ ఒక గంట యోగా చెయ్యాలి అని అన్నారు.ఈ కార్యక్రమం లో హాస్పిటల్ హెచ్ ఓ డీస్ , మార్కెటింగ్ టీమ్, స్టాఫ్ నర్సెస్, పిఆర్‌ఓచందు వర్మ సిబ్బంది పాల్గొన్నారు.










