Mar 08,2023 21:43

పోస్టర్‌ను ఆదిష్కరిస్తున్న దృశ్యం

పోస్టర్‌ను ఆదిష్కరిస్తున్న దృశ్యం
మెడికవర్‌ యాజమాన్యం ప్యాకేజీ పోస్టర్‌ ఆవిష్కరణ
నెల్లూరు:అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని నగరంలోని మెడికవర్‌ హాస్పిటల్స్‌ ఆవరణంలో ప్రత్యేక ప్యాకేజీ ని మహిళా డాక్టర్స్‌ చేతుల మీదుగా మెడికవర్‌ హాస్పిటల్‌ వారు ప్యాకేజీ పోస్టర్ని, మహిళ టీచర్స్‌ కి కూడా ప్రత్యేక ఉచిత ప్యాకేజీని ప్రకటించారు. బుధవారం అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ నెల 31వ తేది వరకు మహిళలకు రూ.5 వేలు విలువ చేసే పరీక్షలు కేవలం రూ.600లకే నిర్వహిస్తామన్నట్లు ప్రకటించారు. మహిళ టీచర్స్‌ , మహిళ లెక్చరర్స్‌ కూడా ఉచిత ప్యాకేజీ అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా పిలుపు నిచ్చారు
. మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని హాస్పిటల్‌ మహిళ సిబ్బందికి క్రీడా పోటీలు నిర్వహించి గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్‌ హిమబిందు రేడియాలజీస్ట్‌, డాక్టర్‌ ఆర్‌ ప్రియ రేడియేషన్‌ ఆం కాలజిస్ట్‌ డాక్టర్‌ కె నిషిత రేడియాలజీస్ట్‌,డాక్టర్‌ సాహిత్య ఎమర్జెన్సీ మెడిసిన్‌ , డాక్టర్‌ హిమ బిందు ఎమర్జెన్సీ మెడిసిన్‌, డాక్టర్‌ శ్రీజ అనస్థీషియా,డాక్టర్‌ భావన అనస్తేషియ, సెంటర్‌ హెడ్‌ డాక్టర్‌ గణేష్‌, మార్కెటింగ్‌ రీజనల్‌ హెడ్‌ ఉదరు భాస్కర్‌, హెచ్‌ ఆర్‌ మల్లేష్‌ సిబ్బంది పాల్గొన్నారు.